ఎసిబి వలలో ఎంఆర్‌ఒ

మన తెలంగాణ/ నిజాంపేట్ :భూమి పత్రాల కోసం రూ. 50 వేలు లంచం తీసుకున్న బాచుపల్లి తహసీల్దార్ వై. యాదగిరి గురువారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. బి.శ్రీనివాస్‌రావు అనే బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి మండల కార్యాలయం లో తహశీల్దార్ ఎన్.వై.గిరి ఫిర్యాదు దారుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. వివరాల్లోకి వెళితే జూలై 31వ తేదిన బి.శ్రీనివాస్‌రావు అనే బిల్డర్ సర్వే నంబర్ 243 లో గల […] The post ఎసిబి వలలో ఎంఆర్‌ఒ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/ నిజాంపేట్ :భూమి పత్రాల కోసం రూ. 50 వేలు లంచం తీసుకున్న బాచుపల్లి తహసీల్దార్ వై. యాదగిరి గురువారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. బి.శ్రీనివాస్‌రావు అనే బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి మండల కార్యాలయం లో తహశీల్దార్ ఎన్.వై.గిరి ఫిర్యాదు దారుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. వివరాల్లోకి వెళితే జూలై 31వ తేదిన బి.శ్రీనివాస్‌రావు అనే బిల్డర్ సర్వే నంబర్ 243 లో గల స్థలానికి సంబంధించి ప్లాట్ నంబర్ 13, 14, 15 నిర్ధారిస్తూ నక్షా వేసి ఇవ్వాలని సర్వేయర్ ద్వారా మండల తహశీల్దార్ ఎన్.వై.గిరిని సంప్రదించాడు. ఇందుకు లక్షరూపాయలు లంచం ఇవ్వాలని సదరు అధికారి కోరాడు. అంగీకరించిన బిల్డర్ తొలివిడతగా రూ.50 వేలు ముట్టజెప్పాడు. దీంతో ఈ నెల 5వ తేదిన సదరు స్థలానికి చెందిన నక్షాను వేసి బిల్డర్‌కు అందజేశారు.

అయితే నక్షాలో పూర్తి వివరా లు లేవని, తనకు ఉపయోగపడడంటూ బిల్డర్ తహసీల్దార్‌ను సంప్రదించి తిరిగి తన డబ్బులు తనకు ఇవ్వాలని బిల్డర్ కోరాడు. ఈ నెల 14వ తేదిన తహశీల్దార్ వ్యక్తి గత డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ సయ్యద్‌కు రూ.40 వేలు ఇచ్చి తిరిగి పంపించాడు. రూ.10 వేలు ఇతరత్రా ఖర్చులు అయినట్లు తెలిపారు. అయితే భూమి పత్రాల కోసం తన వద్ద తహసీల్దార్ ఎన్.వై.గిరి డబ్బులు తీసుకున్న విషయాన్ని ఎసీబీ అధికారులకు బిల్డర్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎసీబీ అధికారుల బృందం బాచుపల్లి మండల కార్యాలయంలో గురువారం ఉదయం సోదాలు చేపట్టి అధారాల ను సేకరించారు. అనంతరం తహసీల్దార్ ఎన్.వై. గిరి, వ్యక్తిగత డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ సయ్యద్‌ను అదుపులోకి తీసుకుని విచారించి లంచం తీసుకున్నట్లు ధృవీకరించారు. అనంతరం ఇరువురిని ఎసిబి ప్రత్యేక కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఎంఆర్‌ఒ ఇంట్లో ఎసిబి సోదాలు
లంచం కేసులో పట్టుబడ్డ ఎంఆర్‌ఒ యాదగిరి ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఈక్రమంలో ఇదే కేసులో పట్టుబడ్డ ఎంఆర్‌ఒ డ్రైవ ర్ మహ్మద్ అబ్దుల్ సయ్యద్ ఇంట్లో సైతం ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. కాగా ఎంఆర్‌ఓ ఇంట్లో గురువారం రాత్రి వరకు సోదాలు చేపట్టారు. కాగా ఈసోదాలలో పట్టుబడిన నగదు, నగల సమాచారాన్ని ఎసిబి అధికారులు గోప్యం గా ఉంచారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడిస్తామని ఎసిబి అధికారులు పేర్కొంటున్నారు.

Bachupally MRO Arrested By ACB Officials in Bribe Case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎసిబి వలలో ఎంఆర్‌ఒ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: