కష్టాల్లో టీమిండియా

విండీస్‌తో తొలి టెస్టు అంటిగ్వా: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆడుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లోనే భారత్ తడబడింది. వెస్టిండీస్‌తో గురువారం ప్రారంభమైన మొదటి టెస్టులో టీమిండియా తాజా సమచారం లభించే సమయానికి 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆతిథ్య విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం సరైందేనని ప్రారంభంలోనే తేలి పోయింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, కెఎల్.రాహుల్‌లు బరిలోకి దిగారు. అయితే కొత్త ఆటగాడు మయాంక్ […] The post కష్టాల్లో టీమిండియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విండీస్‌తో తొలి టెస్టు
అంటిగ్వా: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆడుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లోనే భారత్ తడబడింది. వెస్టిండీస్‌తో గురువారం ప్రారంభమైన మొదటి టెస్టులో టీమిండియా తాజా సమచారం లభించే సమయానికి 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆతిథ్య విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం సరైందేనని ప్రారంభంలోనే తేలి పోయింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, కెఎల్.రాహుల్‌లు బరిలోకి దిగారు. అయితే కొత్త ఆటగాడు మయాంక్ విఫలమయ్యాడు. ఐదు పరుగులు మాత్రమే చేసి రోచ్ వేసిన అద్భుత బంతికి వికెట్ల వెనుక దొరికి పోయాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పూజారా కూడా నిరాశ పరిచాడు.

రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ కూడా కీమర్ రోచ్‌కే దక్కింది. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా విఫలమయ్యాడు. రెండు ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించిన కోహ్లి 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 25 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్య రహానెతో కలిసి మరో ఓపెనర్ రాహుల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఇదే క్రమంలో నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ, కుదురుగా ఆడుతున్న రాహుల్ (44)ను రోస్టన్ ఛేజ్ వెనక్కి పంపాడు. దీంతో భారత్ కష్టాలు మళ్లీ మొదటి కొచ్చాయి.

india vs west indies test match 2019

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కష్టాల్లో టీమిండియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: