తమిళనాట అమానవీయం

 పంటపొలాల్లోంచి దళితుడి శవాన్ని తీసుకెళ్లనివ్వని అగ్రవర్ణాలు బ్రిడ్జిపై నుంచి మృతదేహాన్ని జారవిడిచి అంత్యక్రియలకు తరలింపు చెన్నై: తమిళనాడులోని వెల్లూర్‌లో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన చోటుచేసుకుంది. తమ పంటపొలాల నుంచి దళిత వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలు నిరాకరించారు. ఆ దారి తప్పమరోటి లేకపోవడంతో దళితులకు దిక్కుతోచలేదు. చేసేదేం లేక ఏ వంతెన పైనుంచైతే శవాన్ని మోసుకెళ్తున్నారో అదే వంతెనపై దించి శవానికి రెండు వైపుల పొడవాటి తాళ్లు కట్టారు. వంతెన పైనుంచి మృతదేహాన్ని కిందకు జారవిడిచి […] The post తమిళనాట అమానవీయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 పంటపొలాల్లోంచి దళితుడి శవాన్ని తీసుకెళ్లనివ్వని అగ్రవర్ణాలు
బ్రిడ్జిపై నుంచి మృతదేహాన్ని జారవిడిచి అంత్యక్రియలకు తరలింపు

చెన్నై: తమిళనాడులోని వెల్లూర్‌లో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన చోటుచేసుకుంది. తమ పంటపొలాల నుంచి దళిత వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలు నిరాకరించారు. ఆ దారి తప్పమరోటి లేకపోవడంతో దళితులకు దిక్కుతోచలేదు. చేసేదేం లేక ఏ వంతెన పైనుంచైతే శవాన్ని మోసుకెళ్తున్నారో అదే వంతెనపై దించి శవానికి రెండు వైపుల పొడవాటి తాళ్లు కట్టారు. వంతెన పైనుంచి మృతదేహాన్ని కిందకు జారవిడిచి మరో దారి గుండా శ్మశాన వాటికకు తరలించారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లా వనియంపాడిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎన్.కుప్పమ్ (46) అనే వ్యక్తి గత శనివారం మృతి చెందాడు.

అయితే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి తమ పొలం నుంచి శవాన్ని తీసుకెళ్లేందుకు అగ్రవర్ణాల వారు అంగీకరించలేదు. పురాతనమైన ఆది ద్రావిడర్ శ్మశాన వాటికకు ఈ పంట పొలాల నుంచే వెళ్లాల్సి ఉంటుంది. పొలాల యజమానులు అనుమతించకపోవడంతో సమీపలోని వంతెన కింద నుంచి మృతదేహాన్ని తరలించారు. ఇందుకోసం కుటుంబసభ్యులు పాడెకు తాళ్లుకట్టి 20 అడుగుల ఎత్తు నుంచి వంతెన కిందకు జారవిడిచారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అగ్రవర్ణాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా దళితులపట్ల ఇంత దారుణమైన వివక్ష కొనసాగుతుందా? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనమింకా ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అని పలువురు ప్రశ్నించారు. ఘటనపై తిరుపత్తూరు తాలుకా సబ్ కలెక్టర్ స్పందించారు. దీనిపై విచారణ జరిపిస్తామని, చర్యలు తీసు కుంటామని చెప్పారు.

Funeral procession blocked Dalits airdrop body for cremation

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తమిళనాట అమానవీయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: