ఇసుక…ఇంతింతై…అల్లంతై

చార్‌మినార్ నుంచి నేటి నిర్మాణాల వరకు చాలా మట్టుకు పల్లెటూళ్లలో ఊరి బయట వాగులుంటాయి. అవి సహజ సిద్ధంగా ఏర్పడ్డవే. వాటిపై వంతెనలు లేకపోతే ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు బయటి ప్రపంచంతో ఊరికి సంబంధాలు కూడా తెగిపోతాయి. ఎప్పుడూ ప్రవహించే వాగు నీళ్లకు స్వచ్ఛత ఎక్కువ. వాగు నీటి స్వచ్ఛత గురించి చెప్పాలంటే చెలిమెల ప్రస్తావన తీసుకు రావాల్సిందే. వాగుకు ఇరువైపుల ఉండే ఇసుకలో కొంత లోతుగా గుంట తోడితే దానిలో నీరు ఊరుతుంది. ఊరిన మలిన […] The post ఇసుక… ఇంతింతై… అల్లంతై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చార్‌మినార్ నుంచి నేటి నిర్మాణాల వరకు

చాలా మట్టుకు పల్లెటూళ్లలో ఊరి బయట వాగులుంటాయి. అవి సహజ సిద్ధంగా ఏర్పడ్డవే. వాటిపై వంతెనలు లేకపోతే ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు బయటి ప్రపంచంతో ఊరికి సంబంధాలు కూడా తెగిపోతాయి. ఎప్పుడూ ప్రవహించే వాగు నీళ్లకు స్వచ్ఛత ఎక్కువ. వాగు నీటి స్వచ్ఛత గురించి చెప్పాలంటే చెలిమెల ప్రస్తావన తీసుకు రావాల్సిందే. వాగుకు ఇరువైపుల ఉండే ఇసుకలో కొంత లోతుగా గుంట తోడితే దానిలో నీరు ఊరుతుంది. ఊరిన మలిన నీటిని తీసేస్తే స్వచ్ఛమైన నీరు క్షణాల్లో బయటికొస్తుంది. కొద్ది సేపట్లోనే చెలిమెలో తీయని తాగునీరు సిద్ధమవుతుంది. బాటసారులుగాని ఆ వైపు పని పై వచ్చిన వాళ్లుగాని వాగు కనబడగానే చెలిమె తీసుకొని తమ దాహార్తిని తీర్చుకుంటారు. సద్ది గిన్నెలుంటే భోజనం కూడా అక్కడే ముగించుకుంటారు. ఈ స్వచ్ఛతకు, నీరు భూమిలోకి ఇంకకుండా ప్రవాహంలా సాగేందుకు దోహదపడేది ఇసుక.

ఇసుకతో ఏ పనీలేని మానవ జాతి శతాబ్దాలుగా వాగు నీటిని తమ వివిధ అవసరాలకు వాడుకుంది. వరద ఉధృతితో వాగుల్లో ఇసుక పెరుగుతూ దాపున ఉన్న పంట భూముల్లోకి చొచ్చుక వచ్చినా భూమిని వదులుకున్నారుగాని, ఇసుకను తీసేయలేకపోయా రు. నీటిని భూమిలో ఇంకినట్లుగా పోనీయకుండా ఇసుక వాగుల్లో, నదుల్లో రేణువు పక్కన రేణువు కూడి సందీయకుండా ప్రవాహానికి తోడ్పడుతోంది. నదుల్లో ప్రవాహ ఉధృతికి మట్టి, ఇసుక కొట్టుకు పోయి రాళ్లు, రప్పలు తేలడం జరుగుతోంది. వాగుల్లో మాత్రం వేగం మందగించడం వల్ల స్పటికారపు ఇసుక మెరుస్తూ కనబడుతుంది. ఎడారుల్లో ఉండే ఇసుక గాలి వేగానికి రాపిడికి గురవుతూ సన్ననిపొడిగా, గుండ్రంగా మారుతుంది. తేలికగా ఉండడం వల్ల విసిరి కొట్టే గాలికి లేచి తుఫానులకు కారణభూతమవుతుంది.

గృహ నిర్మాణాలకు మట్టిని, మట్టిని కాల్చి చేసిన ఇటుకల్ని వాడడంతో పిడికెడు ఇసుకను కూడా ఎవరూ తీసుకునే వారు కాదు. ఇసుకలోని రంగు రంగు రాళ్లను ఏరుకొని వాటి మధ్యన రంధ్రాలు చేసి పూసలుగా ఆభరణాల్లో వాడినట్లు ఈజిప్టులోని క్రీ.పూ. 3000 నాటి చరిత్రలో ఉంది. అంతకు పూర్వం ఇసుకను ఒకచోట కుప్పగా పోసి ఆయుధాలను సానపట్టేందుకు వాడేవారట. 1607 లో అమెరికా వాళ్లు ఇసుకను అధిక వేడిలో కరిగించి పలకల్ని చేయగలిగారు. దానిని శుద్ధి చేసే క్రమంలో 1739 లో న్యూజెర్సీలో పారదర్శక గాజు ఫలకాన్ని రూపొందించారు. రాజభవనాల నిర్మాణంలో రంగు రంగు గాజు అద్దాల్ని వాడడంతో వాటి నిర్మాణానికి డిమాండ్ పెరిగింది. ఇసుక వాడకం ముందుగా గాజు పరిశ్రమలోనే మొదలైంది.

చిత్తడి, తడి నేలలో రోడ్లు వేయడానికి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మట్టిలో ఇసుకను కలిపివేయడం ఆరంభమైంది. బంక మట్టిలో ఇసుక కలపడం వల్ల రోడ్లపై మోటారు వాహనాలు జారడం ఆగిపోయింది. సున్నపు రాయి పొడిలో ఇసుకను కలిపి భవంతుల నిర్మాణం మొదలయ్యాక ఇసుక అవసరం మారిపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ప్రపంచంలో ఇసుక, సున్నపు రాయి మిశ్రమంతో నిర్మించిన తొలి కట్టడం చార్‌మినార్. సున్నపు రాయి, ఇసుక 3ః1 నిష్పత్తిలో కలిపి ఈ నిర్మాణం జరిగింది. ఆ మిశ్రమ పటిష్టతను చూసేందుకు యురోపియన్ శాస్త్రవేత్తలు స్వయంగా వచ్చారని చరిత్రలో ఉంది.

1840 లో ప్రపంచానికి పరిచయమైన పొడి సిమెంటు మన దేశానికి చాలా ఆలస్యంగానే వచ్చింది. సున్నపు రాయితోనే మెత్తటి రాతి పొడిని, 3% జిప్సమ్‌ను కలుపడంతో పోర్టేలాండ్ సిమెంట్ తయారవుతోంది. 1914లో ఇండియన్ సిమెంటు కంపెని (ఐసిసి) దేశంలో తొలిసారిగా గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో సిమెంటు ఫ్యాక్టరీ నెలకొల్పింది. సిమెంటు రాకతో ఇసుకకు రెక్కలొచ్చినయి. ఏ నిర్మాణానికైనా సిమెంటు పొడితో 75 % ఇసుకను కలుపవలసి ఉంటుంది. ఒక్కో ఇంటికి సుమారు 200 టన్నుల ఇసుక అవసరమవుతుంది.

భవనాలకు 300 టన్నులు, ఒక మైలు జాతీయ రహదారికి 15000 టన్నుల ఇసుక వాడబడుతుంది. ఇలా 1950 నుండి సిమెంటు వాడకంతో ఇళ్ల నిర్మాణాలు, భవంతులు, అంతస్తుల కట్టడాలు లెక్కకు అందకుండాపోయాయి. ఆనాటి నుండి ఇసుక అపురూపవస్తువైంది. నదుల్లో, వాగుల్లో ఉన్న ఇసుకను ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో, ఆ తర్వాత లారీల్లో దూర ప్రాంతాలకు తరలించడం మొదలైంది. నగరాల్లో నిర్మాణాలు పెరిగిపోవడంతో ఎంత దూరంలో ఇసుక ఉన్నా తెచ్చుకోవడం తప్పలేదు. ఇసుక కొనుగోలుకు గ్రామ పంచాయతీకి కట్టారు. ఇసుక కన్నా దాని రవాణకే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది.

దేశానికి మూడు వైపులా సముద్రం ఉన్నా సముద్రపు ఇసుకలో లవణ శాతం ఎక్కువగా ఉన్నందు వల్ల అది పూర్తిగా నిర్మాణాలకు వినియోగం కాదు. సముద్రపు ఇసుకకు ఇనుప కడ్డీలను తినివేసే లక్షణం ఉంటుంది. నెల్లూరు సమీపంలో నిర్మించిన కృష్ణపట్నం ఓడ రేవు నిర్మాణానికి సరిపడా ఇసుక 54000 టన్నుల మేరకు మలేసియా నుండి తెప్పించుకున్నారు. రేవు నిర్మాణానికి సైతం సముద్రపు ఇసుక పనికి రాకుండా పోయింది.

ఇలా ఇసుక వినియోగం పెరిగిపోవడం వల్ల 2000 నుండి ఇసుక మాఫియా దాకా వెళ్లింది. ఉన్న నిలువల కన్నా అవసరాలు ఎన్నో రెట్టు ఉండడంతో ఇసుక అక్రమ సరఫరా, తప్పుడు బిల్లులు, వాహనాల్లో అధిక లోడు, అధికారుల అవినీతి, నాయకుల సంపాదనలకు ఆలవాలమైంది. తెలంగాణలో ఏడాదికి 23 మిలియన్ టన్నుల ఆవశ్యకత ఉంటే లభ్యత 13 మి. టన్నుల మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఇసుక అక్కడి అవసరాల్ని 30% కూడా తీర్చడం లేదు.

ప్రకృతి పరంగా ఉత్పత్తి అయ్యే ఇసుక కన్నా వాడకం రెట్టింపు అయ్యింది. అయితే వాగుల్లోంచి, నదుల్లోంచి ఇసుకను ఏ మేరకు తీసుకోవచ్చునో, వాటి అస్తిత్వానికి దెబ్బ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు ఇసుక మైనింగ్ కంపెనీలకు విధి విధానాల రూప కల్పన చేశాయి. ఇసుక ధరలను స్థిరీకరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మన ఇసుక వాహనం. అనే సైటు ద్వారా ఇసుకను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది. అనుమతికి మించిన ఇసుకను తరలించే వాహనాలకు సంబంధింత శాఖల అధికారులు తనిఖీ చేసి వాటిని బ్లాక్ లిస్టుల్లో పెడుతున్నారు.

ప్రభుత్వ విధానం ప్రకారం వాగులు, నదుల్లో ఇసుకను కాంట్రాక్టు ద్వారా దక్కించుకున్న వారు రోజూ లారీల్లో పట్టణ, నగర శివార్లలోకి తరలించి తమ సొంత వెబ్‌సైట్ల ద్వారా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. 22 టన్నుల సామర్థం గల లారీ లోడ్ ఇసుకకు రూ. 28000/ దాకా ఉంటుంది. టన్ను ధర 1300 అనుకుంటే కిలో ఇసుక వెల రూపాయిపైనే.

Special story about Sand

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇసుక… ఇంతింతై… అల్లంతై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: