హైదరాబాద్‌ను యుటిగా చేయడం లేదు

  కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తున్నామన్న వార్తల్లోనూ నిజం లేదు ఎపి రాజధాని మార్పు కేంద్రం పరిధిలోకి రాదు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ : హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేస్తున్నట్లుగా సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడిం చారు. బుధవారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఇఎస్ ఐసిలో రూ.150కోట్లతో నిర్మించిన కొత్త బ్లాక్ […] The post హైదరాబాద్‌ను యుటిగా చేయడం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తున్నామన్న వార్తల్లోనూ నిజం లేదు
ఎపి రాజధాని మార్పు కేంద్రం పరిధిలోకి రాదు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేస్తున్నట్లుగా సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడిం చారు. బుధవారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఇఎస్ ఐసిలో రూ.150కోట్లతో నిర్మించిన కొత్త బ్లాక్ నిర్మా ణాన్ని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడి యా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు.

హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానిపై లోతుగా అధ్యయనం చేసిన తరువాతే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం హైదరాబా ద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేసే అంశంలోనూ, కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తున్నామని సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కిషన్‌రెడ్డి తెలి పారు. ఇవి చాలా రోజులుగా సాగుతున్న ప్రచా రంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించ బోతున్నారన్న విషయంపై పెద్దఎత్తున సోషల్ మీడియాలో జరు గుతున్న ప్రచారంపై కూడా ఆయన స్పందిం చారు. రాజధాని మార్పు విష యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం అన్నది రాష్ట్రానికి స్పందించిన విషయమని ఆయన తెలిపారు. ఇది అసలు కేంద్ర పరిధిలోకే రాదని, అలాంటప్పుడు మేము ఎలా నిర్ణయం తీసుకుం టామని ప్రశ్నించారు. పేదప్రజల ఆరో గ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకొచ్చిన ఆయు ష్మాన్ భవ కార్యక్ర మాన్ని బక్వాస్ అని టిఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యా నించడం తగదన్నారు.

ఇక్కడి రోగుల దృష్టా దానిని తెలంగాణలో కూడా అమలు చేయా లని సూచించారు. త్వరలో రాష్ట్రంలో జరగ నున్న మున్సిపల్ ఎన్నికలు బిజెపి టార్గెట్ కాదని, వచ్చే అసెంబ్లీ ఎన్నిల్లో విజయం సాధించమే తమ అంతిమ లక్షమని కిషన్‌రెడ్డి వెల్లడించారు. బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా ఎవరో తెలియదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానిం చడం సరైంది కాదన్నారు. రాజకీ యాల్లో పరస్పరం గౌరవ, మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే విధంగా వ్యవ హరించాలని సూచించారు.

Hyderabad is not a UT

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హైదరాబాద్‌ను యుటిగా చేయడం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: