కార్మికుడే ఓనర్

  సిరిసిల్ల చేనేత కార్మికుల కోసం 387కోట్లతో ప్రత్యేక పథకం రూ.1600 కోట్ల దుస్తుల ఉత్పత్తి ఆర్డర్లు రూ.900 కోట్ల బతుకమ్మ చీరల కొనుగోలు అపెరల్ పార్కులో 10వేల మంది మహిళలకు ఉపాధి ఎంఎల్‌ఎ, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సిరిసిల్ల : దేశంలో వ్యవసాయం తరువాత స్థానంలో ఉన్న వస్త్రోత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడానికి సిఎం కెసిఆర్ నాయకత్వంలో సిరిసిల్ల నేతకళాకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం గత నాలుగేళ్లలోనే […] The post కార్మికుడే ఓనర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిరిసిల్ల చేనేత కార్మికుల కోసం 387కోట్లతో ప్రత్యేక పథకం రూ.1600 కోట్ల దుస్తుల ఉత్పత్తి ఆర్డర్లు
రూ.900 కోట్ల బతుకమ్మ చీరల కొనుగోలు
అపెరల్ పార్కులో 10వేల మంది మహిళలకు ఉపాధి
ఎంఎల్‌ఎ, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

సిరిసిల్ల : దేశంలో వ్యవసాయం తరువాత స్థానంలో ఉన్న వస్త్రోత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడానికి సిఎం కెసిఆర్ నాయకత్వంలో సిరిసిల్ల నేతకళాకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం గత నాలుగేళ్లలోనే రూ.1,600 కోట్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చామని సిరిసిల్ల శాసన సభ్యులు, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడె ంట్ కెటిఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కెటిఆర్ పాల్గొ ని మాట్లాడుతూ సిరిసిల్ల నేతన్నల సంక్షే మం కోసం రూ. 900 కోట్ల విలువైన బతుకమ్మ చీరెల ఆర్డర్లు అందించామన్నారు.

గత ప్రభుత్వాలు యజమానులకు మాత్రమే లాభం చేసే పథకాలు అమలు చేయగా తెలంగాణ వచ్చాక కార్మికుల కోసం కార్యక్రమాలు చేపట్టి సిరిసిల్ల నేతన్నలకు బృహత్తరమైన ప్రణాళికలతో ఉపాధి కల్పించామన్నారు. ప్రభుత్వ శా ఖలకు అవసరమయ్యే 40 కోట్ల 50 లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తి (రూ. 1600 కోట్ల విలువ గలవి )ఆర్డర్లు సిరిసిల్లకు అందించామన్నారు. నేతన్నకు గౌరవ-భద్రతతో కూడిన జీవితం తమ లక్షమని, గత 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికున్ని యజమానిని చేసేందుకు రూ. 387 కోట్లతో పథకం రూపొందించామన్నారు. ఒక్క బతుకమ్మ చీరల తయారీ ఆర్డరే గత మూడేళ్లలో రూ. 900 కోట్లు ఇచ్చామన్నారు. దీనివల్ల సిరిసిల్ల పవర్‌లూం కార్మికులకు ఏడాదిలో 8 నెలలు ఉపాధి లభిస్తోందన్నారు.

కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చిరుకానుక అభిస్తోందన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ సిరిసిల్ల యజమానులను పిలిచి ప్రభుత్వం వల్ల యజమానులు లబ్ధి పొందడమే కాకుండా కార్మికులకు కూడా లబ్ధ్ది చేకూరాలని సూచించడంతో యజమానులు స్పందించారన్నారు. గతంలో కార్మికులు నెలకు 7, 8 వేల రూపాయల కూలీ సంపాదించుకోగా బతుకమ్మ చీరెల వల్ల నెలకు కార్మికులకు కనీసంగా 16 నుంచి 20 వేల రూపాయలు కూలీ లభిస్తోందన్నారు. కొందరికైతే 25 వేల రూపాయల కూలి కూడా గిట్టుబాటు అవుతోందని వివరించారు. సిరిసిల్లలో పవర్‌లూంలు ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సిరిసిల్లలో 808 మంది కార్మికులకు 5కోట్ల 80 లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్నారు.

త్రిఫ్ట్ పథకం కింద కోటి 18 లక్షలు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ చెల్లించామన్నారు. పవర్‌లూంలకు 50 శాతం విద్యుత్ రాయితీల కింద 30 కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించామన్నారు. సిరిసిల్లలోని 11,262 పవర్‌లూంలపై తయారైన బతుకమ్మ చీరెలకు 10 శాతం యారన్ సబ్సిడీ కింద 9 కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. పెద్దూరులో 64 ఎకరాల్లో 175 కోట్ల రూపాయల వ్యయంతో అపెరల్ పార్క్ ఏర్పాటు చేసి అందులో 10వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. తిరుపూర్‌కు పోటీగా సిరిసిల్ల వస్త్రాలు తయారు కావాలన్నారు. రూ. 108 కోట్లతో టెక్స్‌టైల్ పార్క్‌లో పనులు చేపడుతున్నామన్నారు. ఆధునికమైన అడ్మినిస్ట్రెటివ్ భవనం, కామన్ ఫెసిలిటి సెంటర్‌ను, విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రపంచ స్థాయి పోటీకి సిరిసిల్ల వస్త్రాలు తయారు కావాలని అందుకు సిరిసిల్ల పవర్‌లూంలను ఆధునీకరించుకోవాలన్నారు. సిరిసిల్ల చీరెలకు బ్రాండ్ ఇమేజీ రావాలని, మార్కెట్లో గద్వాల చీరెల్లాగా పోటీకి తట్టుకుని అమ్మకాలు జరిగేలా చూడాలని అన్నారు. సిరిసిల్ల వస్త్రోత్పత్తిలో మరో తిరుపూర్‌గా మారాలని అన్నారు. దేశవ్యాప్తంగా తిరుపూర్ వస్త్రాలకు ప్రస్తుతం ఉన్నా బ్రాండ్ ఇమేజి సిరిసిల్ల వస్త్రాలకు కూడా త్వరలోనే రావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ప్రస్తుత నేత కళాకారులు అభివృధ్ధి చెందాలని ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని చూసి భవిష్యత్తారాలు, నేతన్నల కుటుంబ సభ్యులు నేతవృత్తినే నమ్ముకుని జీవించేలా నవీన ఆవిష్కరణలు రావాలన్నారు.

సిరిసిల్లలో తయారైన బతుకమ్మ చీరెలు తాను పరిశీలించానని అద్భుతంగా ఉన్నాయన్నారు. రానున్న సెప్టెంబర్ 15 నాటికి సిరిసిల్లలో ఉత్పత్తయిన కోటి బతుకమ్మ చీరెలు తెలంగాణ ఆడబిడ్డలకు చిరుకానుకగా అందుతాయని, అదే సమయంలో వేలాదిమంది సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి లభిస్తోందని వివరించారు. సిరిసిల్ల చీరెలకు బ్రాండ్ ఇమేజి లభించేంత వరకు అధికారులు, మీడియా తగిన సహకారం అందించి ప్రచారం చేయడంలో సహకరించాలన్నారు. సెప్టెంబర్‌లో నైపుణ్య శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూడా అనేక పథకాలు అమలు పరుస్తున్నామన్నారు. త్రిఫ్ట్ పథకంలో 8 శాతంకార్మికులు చెల్లిస్తే ప్రభుత్వం 16 శాతం చెల్లిస్తోందని ఇందుకోసం 55 కోట్లు భరిస్తోందన్నారు. 11వేల మంది కార్మికుల రుణమాఫీ కోసం 29 కోట్లు ప్రభుత్వం భరించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బతుకమ్మ చీరెలను స్వయంగా పరిశీలించడమే కాకుండా బతుకమ్మ చీరెలు ఉత్పత్తి చేసే పవర్‌లూంలను కెటిఆర్ కార్ఖానాకు వెళ్లి పరిశీలించారు. కార్మికులతో వస్తున్న కూలీ, ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టెక్స్‌టైల్ డైరెక్టర్ శైలజా రామయ్యార్, జడ్‌పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, ఎంఎల్‌ఏ రసమయి బాలకిషన్, జేసి శేఖ్ యాస్మిన్ భాష, ఆర్‌డిఓ శ్రీనివాసరావు, ఎడిఇ అశోక్‌రావు, తెరాస నాయకులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Work for development of Handloom workers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కార్మికుడే ఓనర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: