సలాడ్స్‌తో బరువు తగ్గుతారు

  సలాడ్స్ అనేవి చాలా ఆరోగ్యకరమైనవి. సలాడ్స్ తీసుకుంటే ఆకలి తట్టుకునే శక్తి, అవసరమైన విటమిన్స్, పీచుపదార్థాలు ఇందులో ఉంటాయి. అంతేకాదు సలాడ్స్ నుంచి బోలడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. కనుక ఇవి డైట్ చేస్తున్నప్పుడు తీసుకోవడం మేలు. సలాడ్స్ చేసుకోండిలా.. 1. పచ్చి కాయగూర ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం అన్నింటిని కలిపి భోజనంతో పాటు ఒక సైడ్ డిష్‌లా తీసుకుంటే ఆరోగ్యకరం. 2. భోజనంతో పాటు తినడం వల్ల ఆహారం సమతుల్యం అవుతుంది. […] The post సలాడ్స్‌తో బరువు తగ్గుతారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సలాడ్స్ అనేవి చాలా ఆరోగ్యకరమైనవి. సలాడ్స్ తీసుకుంటే ఆకలి తట్టుకునే శక్తి, అవసరమైన విటమిన్స్, పీచుపదార్థాలు ఇందులో ఉంటాయి. అంతేకాదు సలాడ్స్ నుంచి బోలడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. కనుక ఇవి డైట్ చేస్తున్నప్పుడు తీసుకోవడం మేలు.

సలాడ్స్ చేసుకోండిలా..

1. పచ్చి కాయగూర ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం అన్నింటిని కలిపి భోజనంతో పాటు ఒక సైడ్ డిష్‌లా తీసుకుంటే ఆరోగ్యకరం.

2. భోజనంతో పాటు తినడం వల్ల ఆహారం సమతుల్యం అవుతుంది. భోజనం తగ్గి బరువు తగ్గుతారు. కొందరు భోజనానికి మధ్య మధ్యలో సలాడ్స్ తింటారు. ఇలా చేయడం వల్ల భోజనం మోతాదు తగ్గదు. పైగా కొన్ని పోషకాలు అందవల సిన టైమ్‌లో అందవు. అందుకే సలాడ్స్ భోజనంతో పాటు తింటే బరువు తగ్గే అవకాశం ఉంది.

3. కీర, దోసకాయ, టమోటా, క్యారెట్, బీట్‌రూట్, క్యాప్సికమ్, ఉల్లి, బ్రొకోలీ, కొత్తిమీర సలాడ్స్‌లో తీసుకోవచ్చు.

4. బెండకాయలు, దొండకాయలు, చిక్కుడు, బీన్స్, ఆలుగడ్డ, స్వీట్ పొటాటో, క్యాబేజీ, కాలీఫ్లవర్ మొదలైనవి సలాడ్‌లో తీసుకోవాలనుకుంటే, ఆ పూట భోజనం మానేసి కేవలం సలాడ్ మాత్రమే తీసుకోవాలి. కొన్ని కాయగూరల్ని ఉడికించి, లేక మగ్గించి సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.

5. తాజా సలాడ్స్ తీసుకుంటున్నప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. ఉడికించిన లేక మగ్గించిన సలాడ్ తీసుకున్నపుడు కూడా ఆలివ్ ఆయిల్ ఉపయోగించొచ్చు.

6. సలాడ్స్ అంటే రుచి లేనివి, గడ్డి తిన్నట్టే, ఎందుకు ఈ బతుకు అని మాత్రం అనుకోవద్దు. సలాడ్స్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జీర్ణకోశం శుభ్రపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సోయా సాస్, చిల్లీ సాస్, జీలకర్ర పొడి, చాట్ మసాలా మొదలైనవి రుచి కోసం వాడుకోవచ్చు.

Healthy Salads For Weight Loss

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సలాడ్స్‌తో బరువు తగ్గుతారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.