హృతిక్ ఇచ్చిన పుస్తకం నా జీవితాన్ని…

ముంబై: సినీ నటి సమీరా రెడ్డి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పై పొగడ్తల వర్షం కురిపించింది. ఎవరి ముందైనా మాట్లాడే సమయంలో తడబాటుకు గురయ్యేదాన్నని, ఆడిషన్స్ సమయంలో చాలా ఇబ్బందికి గురయ్యేదాన్నని సమీరా పేర్కొంది. ఈ మేరకు ఓ చాట్ షోలో సమీరా మాట్లాడుతూ… తన సమస్యను హృతిక్ గుర్తించి, తనను ఇబ్బంది నుంచి బయటపడేందుకు సాయపడ్డాడని చెప్పుకొచ్చింది. హృతిక్ సైతం తన జీవితంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడని తెలిపింది. తన సమస్యను గుర్తించిన […] The post హృతిక్ ఇచ్చిన పుస్తకం నా జీవితాన్ని… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ముంబై: సినీ నటి సమీరా రెడ్డి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పై పొగడ్తల వర్షం కురిపించింది. ఎవరి ముందైనా మాట్లాడే సమయంలో తడబాటుకు గురయ్యేదాన్నని, ఆడిషన్స్ సమయంలో చాలా ఇబ్బందికి గురయ్యేదాన్నని సమీరా పేర్కొంది. ఈ మేరకు ఓ చాట్ షోలో సమీరా మాట్లాడుతూ… తన సమస్యను హృతిక్ గుర్తించి, తనను ఇబ్బంది నుంచి బయటపడేందుకు సాయపడ్డాడని చెప్పుకొచ్చింది.
హృతిక్ సైతం తన జీవితంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడని తెలిపింది. తన సమస్యను గుర్తించిన హృతిక్, తనకు ఓ పుస్తకాన్ని ఇచ్చాడని చెప్పింది. ఆ పుస్తకం తన జీవితాన్నే మార్చివేసిందని సమీరా కొనియాడింది. పుస్తకం చదివిన అనంతరం తన మాటల్లో వచ్చిన మార్పును తాను గమనించానంది. ఇప్పటికీ ఆ పుస్తకం తన వద్దే ఉందన్న సమీరా ఆ పుస్తకం ఇచ్చిన హృతిక్ కు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా సరిపోదని వెల్లడించింది.
Sameera Reddy praise on Hrithik Roshan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హృతిక్ ఇచ్చిన పుస్తకం నా జీవితాన్ని… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: