ఆరోగ్యశ్రీ షురూ

 నెట్‌వర్క్ ఆసుపత్రులతో మంత్రి ఈటల చర్చలు సఫలం నెల నెలా కొంత మొత్తం చెల్లించడానికి నిర్ణయం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆసుపత్రుల సంఘం ఆయుష్మాన్ వద్దు, ఆరోగ్యశ్రీనే ముద్దు : రాకేష్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల బంద్ సమ్మెను విరమించాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మంగళవారం తాత్కాలిక సచివాలయం బి ఆర్‌కె భవన్‌లో జరిపిన చర్చలు సఫలం కా వడంతో వైద్య సేవల బంద్‌ను విరమించుకున్నట్లు […] The post ఆరోగ్యశ్రీ షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 నెట్‌వర్క్ ఆసుపత్రులతో మంత్రి ఈటల చర్చలు సఫలం
నెల నెలా కొంత మొత్తం చెల్లించడానికి నిర్ణయం
సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆసుపత్రుల సంఘం
ఆయుష్మాన్ వద్దు, ఆరోగ్యశ్రీనే ముద్దు : రాకేష్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల బంద్ సమ్మెను విరమించాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మంగళవారం తాత్కాలిక సచివాలయం బి ఆర్‌కె భవన్‌లో జరిపిన చర్చలు సఫలం కా వడంతో వైద్య సేవల బంద్‌ను విరమించుకున్నట్లు తెలంగాణ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. తక్షణమే వైద్య సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఇజిహెచ్‌ఎస్ పథకాల కింద పేదలు, ఉద్యోగులకు నెట్‌వర్క్ ఆసుపత్రులు నగదు రహిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. బకాయిలపై ప్రైవేట్ ఆసుపత్రులు ఒక లెక్క, ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉండటంతో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. చెల్లింపులు పూర్తిగా చేయకపోవడంతో ఆగస్టు 16వ తేదీ నుంచి ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేశాయి. దీంతో మంగళవారం మంత్రి ఈటల రాజేందర్ చర్చలు జరిపి వెంటనే రూ.100 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మరో పది రోజుల్లో రూ.60 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ గొప్పగా అమలవుతుందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 85 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కన్నా కూడా తెలంగాణ ఆరోగ్యశ్రీ 100 రెట్లు బాగా అమలవుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ కేవలం 25 లక్షల కుటుంబాలకు అమలు చేస్తున్నారన్నారు. ప్రతి నెల అందాల్సిన డబ్బులు అందకపోవడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్నఆసుపత్రులకు ఇబ్బంది కలగకూడదనే రూ.520 కోట్ల వరకు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. ఇంకా రూ. 490 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాబోయే కాలంలో ప్రతి నెల కొంత ఇవ్వమని కోరారని, దీనిని తప్పకుండా నెరవేరుస్తామన్నారు. 200712 మధ్య జరిగిన ఎంఒయూలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఒక కమిటీని వేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ,తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తామన్నారు.

Minister Etela discussions with network hospitals succeed

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆరోగ్యశ్రీ షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: