స్వీటు బాక్సుల్లో రూ.3.50కోట్ల సౌదీ రియాల్స్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టివేత మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డిఆర్‌ఐ అధికారులు మంగళవారం చేపట్టిన తనిఖీలలో స్వీట్, బిస్కెట్ బాక్స్‌లలో అక్రమంగా తరలిస్తున్న రూ.3.50 కోట్ల సౌదీ అరేబియన్ రియాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశ కరెన్సీ ప్రకారం రూ. 1.75 కోట్లు ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. కాగా ఇద్దరు ప్రయాణీకులు శంషాబాద్ విమానాశ్రమంలో అనుమానస్పదంగా కనిపించడంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగులను, వస్తువులను తనిఖీ చేయగా 7 స్వీట్, ఉస్మానియా బిస్కెట్ బాక్స్‌లో సౌదీ […] The post స్వీటు బాక్సుల్లో రూ.3.50కోట్ల సౌదీ రియాల్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డిఆర్‌ఐ అధికారులు మంగళవారం చేపట్టిన తనిఖీలలో స్వీట్, బిస్కెట్ బాక్స్‌లలో అక్రమంగా తరలిస్తున్న రూ.3.50 కోట్ల సౌదీ అరేబియన్ రియాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశ కరెన్సీ ప్రకారం రూ. 1.75 కోట్లు ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. కాగా ఇద్దరు ప్రయాణీకులు శంషాబాద్ విమానాశ్రమంలో అనుమానస్పదంగా కనిపించడంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగులను, వస్తువులను తనిఖీ చేయగా 7 స్వీట్, ఉస్మానియా బిస్కెట్ బాక్స్‌లో సౌదీ అరేబియన్ రియాల్స్ బయటపడ్డాయి. దీంతో అధికారులు సౌదిరియాల్స్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు ప్రయాణీకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. వీరిద్దరూ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానం(6ఇ 26)లో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి సౌది రియాల్స్‌ను దుబాయ్‌కి చేరవేసే క్రమంలో వీరు డిఆర్‌ఐ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. నిందితులపై ఫెమా చట్టం 1999, కస్టమ్స్ చట్టం 1962 కింద కేసులు నమోదు చేశారు.

Foreign currency worth Rs 1.48 crore concealed in sweet boxes

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్వీటు బాక్సుల్లో రూ.3.50కోట్ల సౌదీ రియాల్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: