హైటెక్ సిటీ నుంచి అమీర్‌పేట్‌కు ప్రతి 4 ని.లకు ఓ మెట్రో

మనతెలంగాణ/సిటీబ్యూరో : హైదరాబాద్ నగర ప్రయాణికులకు మెట్రోరైలు మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. మంగళవారం నుంచి హైటెక్ సిటీ స్టేష న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ట్విన్ సింగిల్ విధానంను మార్చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పు డు ఈ రెండు స్టేషన్‌ల మధ్యలో మెట్రో రైలు రెండు ట్రాక్‌లపై నడుస్తుంటాయి. గతంలో ఒకే ట్రాక్‌పై పోవడం, రావడం ఉండేది. తద్వారా సమయాభావం ఏర్పడేది. ఇప్పుడు ఆ పద్దతి మారిపోయిందన్నారు. […] The post హైటెక్ సిటీ నుంచి అమీర్‌పేట్‌కు ప్రతి 4 ని.లకు ఓ మెట్రో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/సిటీబ్యూరో : హైదరాబాద్ నగర ప్రయాణికులకు మెట్రోరైలు మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. మంగళవారం నుంచి హైటెక్ సిటీ స్టేష న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ట్విన్ సింగిల్ విధానంను మార్చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పు డు ఈ రెండు స్టేషన్‌ల మధ్యలో మెట్రో రైలు రెండు ట్రాక్‌లపై నడుస్తుంటాయి. గతంలో ఒకే ట్రాక్‌పై పోవడం, రావడం ఉండేది. తద్వారా సమయాభావం ఏర్పడేది. ఇప్పుడు ఆ పద్దతి మారిపోయిందన్నారు. దీంతో ప్రతి 4 నిమిషాలకు ఒకమారు హైటెక్‌సిటీ నుంచి అమీర్‌పేట్ వరకు మెట్రోరైలు నడుపుతామని ఆయన తెలిపారు. అదేవిధంగా మియాపూర్ నుంచి ఎల్‌బినగర్ వరకు ప్రతి 5 నిమిషాలకు ఒకమారు రైళ్ళను నడుపుతున్నామని, దాదాపు 60 రైళ్ళను అదనంగా నడుపుతున్నామని ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకుని ప్రతి మూడు నిమిషాలకొక మారు రైళ్ళను నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయ న వెల్లడించారు. ఈ మార్పుతో ఐటి కారిడార్‌లోని వేలాది మంది ఉద్యోగులకు మరింత ప్రయాణ సౌలభ్యం కల్పించినట్టుగా ఉంటుందని తెలిపా రు. ప్రయాణాకులకు బడలిక లేకుం డా ఎసి టెంపరేచర్‌ను 23 సెల్సియస్‌గా నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు.

One Metro every 4 minutes from Hi Tech City to Amerpet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హైటెక్ సిటీ నుంచి అమీర్‌పేట్‌కు ప్రతి 4 ని.లకు ఓ మెట్రో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: