సమరోత్సాహంతో టీమిండియా

అంటిగ్వా: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. వెస్టిండీస్‌తో జరిగిన ట్వంటీ20, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ టెస్టుల్లో సమరోత్సాహంతో బరిలోకి దిగనుంది. మరోవైపు ఆతిథ్య విండీస్‌కు భారత్‌తో జరిగే సిరీస్ సవాలుగా మారింది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. ఇటీవల కాలంలో భారత్‌తో జరుగుతున్న అన్ని సిరీస్‌లలో కూడా విండీడస్‌కు పరాజయమే ఎదురవుతోంది. సొంత గడ్డపై కూడా టీమిండియాను ఓడించలేక పోతోంది. చివరికి తామెంతో బలంగా […] The post సమరోత్సాహంతో టీమిండియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అంటిగ్వా: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. వెస్టిండీస్‌తో జరిగిన ట్వంటీ20, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ టెస్టుల్లో సమరోత్సాహంతో బరిలోకి దిగనుంది. మరోవైపు ఆతిథ్య విండీస్‌కు భారత్‌తో జరిగే సిరీస్ సవాలుగా మారింది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. ఇటీవల కాలంలో భారత్‌తో జరుగుతున్న అన్ని సిరీస్‌లలో కూడా విండీడస్‌కు పరాజయమే ఎదురవుతోంది. సొంత గడ్డపై కూడా టీమిండియాను ఓడించలేక పోతోంది. చివరికి తామెంతో బలంగా ఉన్న ట్వంటీ20 ఫార్మాట్‌లో కూడా చిత్తుగా ఓడింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు మ్యాచ్‌ల టెస్టు సమరం కరీబియన్ జట్టుగా పెను సవాలుగా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న టీమిండియాను ఎదుర్కొవడం విండీస్‌ను చాలా కష్టమనే చెప్పాలి.

టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్న విరాట్ కోహ్లి సేన ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. విండీస్‌తో పోల్చితే భారత్ అందనంత ఎత్తులో నిలిచింది. లోకేశ్ రాహుల్, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, నయా వాల్ చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, అశ్విన్ తదితరులతో భారత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వీరిలో ఏ ఇద్దరూ నిలదొక్కుకున్నా విండీస్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక, టెస్టు చాంపియన్‌షిప్‌లో తొలి పోరు కావడంతో టీమిండియా విజయమే లక్షంగా పెట్టుకుంది. ఇప్పటికే టి20, వన్డేల్లో సిరీస్‌లు సొంతం చేసుకున్న భారత్ టెస్టుల్లో కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది.
ఫేవరెట్‌గా
మరోవైపు సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. కెప్టెన్ విరాట్ కోహ్లి భీకర ఫామ్‌లో ఉన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రహానె, పుజారా, విహారి, రోహిత్, రిషబ్ తదితరులు సత్తా చాటారు. టెస్టుల్లో కూడా చెలరేగేందుకు వీరు సిద్ధమయ్యారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి, పుజారా, రాహుల్ తదితరులు విజృంభిస్తే భారత్‌కు ఎదురే ఉండదు. విండీస్‌తో పోల్చితే భారత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. చాలా మంది సీనియర్లే ఉండడంతో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇషాంత్ శర్మ, బుమ్రా, షమి, ఉమేశ్, అశ్విన్, జడేజా, కుల్దీప్‌లతో బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ టీమిండియా సొంతం. వీరితో పోల్చితే విండీస్ రెండు విభాగాల్లోనూ చాలా బలహీనంగా కనిపిస్తోంది. దీంతో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ ఆతిథ్య వెస్టిండీస్ జట్టుకు పెను సవాలుగా తయారైంది. ఇందులో హోల్డర్ సేన ఎంత వరకు సఫలమవుతుందో చూడాలి.

india vs west indies t 20 match 2019

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమరోత్సాహంతో టీమిండియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: