దండిగా జల విద్యుత్

  హైదరాబాద్ : కృష్ణా నదికి వరదల మూలంగా నిండుకుండల్లా ఉన్న జలాశయాలతో దండిగా జలవిద్యుత్ అందుతుంది. ఎల్‌సి (లెటర్ ఆఫ్ క్రెడిట్)ల మూలంగా ఆర్ధికపరమైన సర్ధుబాట్లలో నిమగ్నమైన డిస్కంలకు జలవిద్యుత్ అనుకోని వరంలా మారింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాల్లో చురుకుదనం లోపించింది. ఫలితంగా ఎండలు మండడం, వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పంపుసెట్లను రైతులు విరివిగా వాడుతున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ సైతం ఒక్కసారిగా పెరిగింది. ఏకంగా పదివేల మెగావాట్ల మార్కును డిమాండ్ దాటింది. ఈ […] The post దండిగా జల విద్యుత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : కృష్ణా నదికి వరదల మూలంగా నిండుకుండల్లా ఉన్న జలాశయాలతో దండిగా జలవిద్యుత్ అందుతుంది. ఎల్‌సి (లెటర్ ఆఫ్ క్రెడిట్)ల మూలంగా ఆర్ధికపరమైన సర్ధుబాట్లలో నిమగ్నమైన డిస్కంలకు జలవిద్యుత్ అనుకోని వరంలా మారింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాల్లో చురుకుదనం లోపించింది. ఫలితంగా ఎండలు మండడం, వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పంపుసెట్లను రైతులు విరివిగా వాడుతున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ సైతం ఒక్కసారిగా పెరిగింది. ఏకంగా పదివేల మెగావాట్ల మార్కును డిమాండ్ దాటింది.

ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి రోజూ 10000 మెగావాట్లకు మించిన డిమాండే నమోదవుతోంది. ఈ సమయంలో జలవిద్యుత్ అందివచ్చిన వరంగా మారింది. అతి తక్కువ, నామమాత్రపు ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి జరిగేది జలవిద్యుత్‌తోనే. జూలై 30 నుంచి జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఆగస్టు 19వ తేదీన గరిష్టంగా 42.77 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ ఉత్పత్తి జరిగింది. 18వ తేదీన ఈ సీజన్లో గరిష్టంగా 10309 మెగావాట్ల కరెంటు డిమాండ్ నమోదైంది. మంగళవారం నాడు 10292 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కాగా, 217.7 మిలియన్ యూనిట్లు వినియోగం జరిగింది.

ఇందులో 101.2 మిలియన్ యూనిట్లు జెన్‌కో నుంచి సమకూరింది. ఇందులో 42.7 ఎంయులు జలవిద్యుత్ ద్వారా సమకూర్చుకున్నారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి 25.9 ఎంయులు, కేంద్ర విద్యుత్ సంస్థలు, ప్రత్యామ్నాయ విద్యుత్, సౌర, పవన విద్యుత్ ద్వారా 70.07 ఎంయులు లభ్యమైంది. దాదాపు నాలుగో వంతు జలవిద్యుత్ ద్వారా లభించింది. 19వ తేదీ వరకు మొత్తం 475 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ సమకూరింది. గరిష్టంగా 19వ తేదీనే 42.7 ఎంయులు ఉత్పత్తి కావడం గమనార్హం.

గత 5 రోజుల్లో జరిగిన విద్యుత్ వినియోగం, జలవిద్యుత్ వివరాలు

తేదీ                                                విద్యుత్ వినియోగం                                  జలవిద్యుత్
19 ఆగస్టు                                        42.77 ఎంయులు                             217.76 ఎంయులు
18 ఆగస్టు                                        39.71 ఎంయులు                             216.97 ఎంయులు
17 ఆగస్టు                                        37.55 ఎంయులు                             218.93 ఎంయులు
16 ఆగస్టు                                        28.36 ఎంయులు                              213.09 ఎంయులు
15 ఆగస్టు                                        32.69 ఎంయులు                              190.56 ఎంయులు

Hydroelectricity is obtained with Reservoirs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దండిగా జల విద్యుత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: