ఐఆర్‌సిటిసికి తేజాస్ రైళ్ల నిర్వహణ బాధ్యత

న్యూఢిల్లీ : కొన్ని రైళ్ల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలకున్న ఆలోచనలో భాగంగా ఐఆర్‌సిటిసికి ప్రయోగాత్మకంగా అహ్మదాబాద్ ముంబయి సెంట్రల్ తేజాస్ ఎక్స్‌ప్రెస్, ఢిల్లీలక్నో తేజాస్ ఎక్స్‌ప్రెస్ నిర్వహణను అప్పగించాలని రైల్వేలు నిర్ణయించాయి. ఈ రైళ్లలో ఛార్జీలు కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉంటాయని, ఐఆర్‌సిటిసి నిర్ణయిస్తుందని రైల్వే వర్గాలు మంగళవారం తెలిపాయి. రైల్వేలు సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం మూడేళ్లపాటు పైలట్ ప్రాజెక్ట్‌గా ఆ రెండు రైళ్ల నిర్వహణ బాధ్యతను రైల్వేలకు చెందిన టూరిజం, కేటరింగ్ విభాగానికి […] The post ఐఆర్‌సిటిసికి తేజాస్ రైళ్ల నిర్వహణ బాధ్యత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ : కొన్ని రైళ్ల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలకున్న ఆలోచనలో భాగంగా ఐఆర్‌సిటిసికి ప్రయోగాత్మకంగా అహ్మదాబాద్ ముంబయి సెంట్రల్ తేజాస్ ఎక్స్‌ప్రెస్, ఢిల్లీలక్నో తేజాస్ ఎక్స్‌ప్రెస్ నిర్వహణను అప్పగించాలని రైల్వేలు నిర్ణయించాయి. ఈ రైళ్లలో ఛార్జీలు కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉంటాయని, ఐఆర్‌సిటిసి నిర్ణయిస్తుందని రైల్వే వర్గాలు మంగళవారం తెలిపాయి. రైల్వేలు సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం మూడేళ్లపాటు పైలట్ ప్రాజెక్ట్‌గా ఆ రెండు రైళ్ల నిర్వహణ బాధ్యతను రైల్వేలకు చెందిన టూరిజం, కేటరింగ్ విభాగానికి ఇస్తారు.

వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు, సదుపాయాలు లేదా డ్యూటీ పాస్‌లు ఈ రైళ్లలో అనుమతించరు. అలాగే ఐఆర్‌సిటిసి రైళ్లలో రైల్వే సిబ్బంది తనిఖీని అనుమతించరు. అయితే లోకో, పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు వంటి రైల్వేల ఆపరేటింగ్ సిబ్బంది ఈ రైళ్ల నిర్వహణలో పాలుపంచుకుంటారు. ‘వంద రోజుల ప్రణాళికలో భాగంగా రైల్వేలు… ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలందించడం లక్షంగా ప్రైవేట్ ట్రైన్ ఆపరేటర్లను రంగంలోకి దింపుతున్నాయి. రెండు తేజాస్ రైళ్లను ఐఆర్‌సిటిసికి అప్పగించడం ఈ లక్షంలో మొదటి అడుగు’ అని రైల్వే వర్గాలు తెలిపాయి.

IRCTC is responsible for maintenance of Tejas Trains

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐఆర్‌సిటిసికి తేజాస్ రైళ్ల నిర్వహణ బాధ్యత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: