కోట్లు పలికిన ప్రేమలేఖ

  పురాతన వస్తువులను కొనడానికి చాలామంది ఇష్టపడతారు. వాటిపై అమితమైన ప్రేమ చూపిస్తారు. అలాంటి వస్తువులు వేలం వేసినపుడు కూడా అత్యధిక ధరలకు అమ్ముడుపోతుంటాయి. నెపోలియన్‌కు చెందిన 200 ఏళ్ల అత్యంత పురాతన ప్రేమలేఖ ఇప్పుడు కోట్ల రూపాయలు పలికింది. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టీ 200 ఏళ్ల క్రితం తన భార్య జోసెఫిన్‌కు రాసిన ప్రేమలేఖ ఇప్పుడు 5,13,000 యూరోలు అంటే సుమారు రూ.3 కోట్ల 97 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది. దాదాపు 1796-1804 మధ్యకాలంలో […] The post కోట్లు పలికిన ప్రేమలేఖ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పురాతన వస్తువులను కొనడానికి చాలామంది ఇష్టపడతారు. వాటిపై అమితమైన ప్రేమ చూపిస్తారు. అలాంటి వస్తువులు వేలం వేసినపుడు కూడా అత్యధిక ధరలకు అమ్ముడుపోతుంటాయి. నెపోలియన్‌కు చెందిన 200 ఏళ్ల అత్యంత పురాతన ప్రేమలేఖ ఇప్పుడు కోట్ల రూపాయలు పలికింది. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టీ 200 ఏళ్ల క్రితం తన భార్య జోసెఫిన్‌కు రాసిన ప్రేమలేఖ ఇప్పుడు 5,13,000 యూరోలు అంటే సుమారు రూ.3 కోట్ల 97 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది. దాదాపు 1796-1804 మధ్యకాలంలో ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. తాజాగా దీనిని ఫ్రాన్స్‌లో వేలం వేశారు. ఈ లేఖలో నెపోలియన్ “నా ప్రియ మిత్రమా! నీ నుంచి నాకు ఎటువంటి లేఖ అందలేదు. ఏదో ముఖ్యమైన పనిమీద ఉన్నట్లున్నారు. అందుకే మీరు మీ భర్తను మరచిపోయారు. ఇప్పుడు నాకున్న పని, అలసటల మధ్య మీరే గుర్తుకు వస్తున్నారు” అని రాశారు. 1815వ సంవత్సరంలో నెపోలియన్ చక్రవర్తి అయ్యాడు. యూరప్‌తో పాటు పలు దేశాలకు నియంతగా వ్యవహరించాడు. ప్రపంచంలోనే మహోన్నత సేనాపతిగా నెపోలియన్ గుర్తింపు పొందాడు.

 

Love Letter Cost is Four Crores

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోట్లు పలికిన ప్రేమలేఖ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.