ఆమె ఆరోగ్యమే కుటుంబానికి రక్షణ

  కాలం ఎంత వేగంగా మారుతున్నా, జీవనశైలి రూపం మార్చుకున్నా, జీవితం వేగవంతం అయినా, కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చటంలో, కుటుంబ ఆర్థిక పరిపుష్టిలో ఇల్లాలే ప్రధాన భాగస్వామి. ప్రేమగా వ్యవహరించటం, ఇతరుల పట్ల జాగ్రత్త్త, కుటుంబ ఆరోగ్య పర్యవేక్షణల్లో ఆమె స్థానం అంగుళం కూడా కదల్లేదు. తన త్యాగంతో కుటుంబ సభ్యుల మొహాల్లో చిరునవ్వులు పూయించగలిగిన మహిళ తన గురించి తాను ఎంత శ్రద్ధ తీసుకుంటుందో మాత్రం సందేహమే. సొంత అవసరాలను తీర్చుకోవటంలో మాత్రం ఆమె […] The post ఆమె ఆరోగ్యమే కుటుంబానికి రక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కాలం ఎంత వేగంగా మారుతున్నా, జీవనశైలి రూపం మార్చుకున్నా, జీవితం వేగవంతం అయినా, కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చటంలో, కుటుంబ ఆర్థిక పరిపుష్టిలో ఇల్లాలే ప్రధాన భాగస్వామి. ప్రేమగా వ్యవహరించటం, ఇతరుల పట్ల జాగ్రత్త్త, కుటుంబ ఆరోగ్య పర్యవేక్షణల్లో ఆమె స్థానం అంగుళం కూడా కదల్లేదు. తన త్యాగంతో కుటుంబ సభ్యుల మొహాల్లో చిరునవ్వులు పూయించగలిగిన మహిళ తన గురించి తాను ఎంత శ్రద్ధ తీసుకుంటుందో మాత్రం సందేహమే.

సొంత అవసరాలను తీర్చుకోవటంలో మాత్రం ఆమె ఎప్పుడూ నిర్లక్షంగా ఉంటుంది. కొంత ఆమె అలక్షం వల్ల మరికొంత కుటుంబ సభ్యులకు ఆమె పట్ల బాధ్యత లేక ఆమె నెమ్మదిగా అనారోగ్యాల పాలు అవుతోందన్నది మాత్రం వాస్తవం. హార్మోనల్ మార్పులు, జీవక్రియ మందగించటం, చర్మంలో మార్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఆమెను చుట్టు ముట్టేస్తున్నాయి. ఈ విషయాన్ని స్త్రీల ఆరోగ్యం గురించి చేస్తున్న ఎన్నో అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.

జీవనశైలి కీలకం: ఆరోగ్యాన్ని జీవనశైలి ప్రభావితం చేస్తుంది. ఏ పదార్థాలు ఏ సమయంలో తింటున్నారు. రోజంతా ఎంత చురుగ్గా ఉంటున్నారు, ఎంత వ్యాయామం చేస్తున్నారు అన్న విషయాలు ఆరోగ్యం గురించి చెప్పేస్తాయి. జీవనశైలి, ఆరోగ్యం మధ్యన విడదీయరాని సంబంధం ఉంటుంది. వీటి ప్రభావం ఆరోగ్య అంశాలపైన పడుతుంది. స్త్రీల విషయంలో శారీరక పనితీరులో హార్మోన్లు కీలకపాత్ర వహిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవటం అసాధారణ పరిమాణం, నాణ్యతా లోపం, ముఖ్యంగా కచ్చితమైన సమయపాలన లేకపోవటం అనేకమైన హార్మోనల్ సమస్యలకు కారణం అవుతున్నాయి. థైరాయిడ్, పి.సి.ఒ.ఎన్, పిసిఒడి, డయాబెటిస్, పి.ఎం.ఎన్ మొదలైన సమస్యలు ఆరంభం అవుతాయి. ఇవన్నీ కేవలం సమయం లేదన్న సాకుతో సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం, విశ్రాంతి లేకపోవటం వల్ల మొదలయ్యే అనారోగ్యాలు.

కీళ్లనొప్పులు: అనేకమంది మహిళలు తరుచూ ఫిర్యాదు చేసే సమస్య వెన్నునొప్పి, జాయింట్ నొప్పులు, కీళ్ల నొప్పులు. ఇవి కాలం గడిచిన కొద్దీ లేచి నిలబడలేని పరిస్థితిని తెచ్చిపెడుతున్నాయి. కాల్షియం, విటమిన్‌డి ఎముకల పనితీరులో కీలకమైన పాత్ర పోషిస్తాయి. చాలినంత కాల్షియం, ఫాస్పరస్, విటమిన్‌డిలు దృఢమైన ఆరోగ్యవంతమైన ఎముకలకు కారణం అవుతాయి. ఉదయం పదినిమిషాలపాటు ఎండలో నడవటం, ఉదయపు వ్యాయామం లేదా అల్పాహారం ఇవేమీ స్త్రీల జీవితంలో ఉండవు. ఒక కప్పు కాఫీ తాగే తీరిక లేకుండా పిల్లలను, భర్తను ఆఫీసుకు పంపే వరకు మొదలుపెట్టిన అంతులేని చాకిరి అనారోగ్యాల హేతువు అవుతుంది. సాధారణంగా శరీరపు బరువు పెరిగి పోవటంతో సమస్య మొదలవుతుంది. శారీరక సాధారణ బరువును తగ్గించుకునేందుకు బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, థ్రెడ్‌మిల్ వాకింగ్‌లు చాలు కానీ సమయం లేదన్న సాకుతో ఇవేమీ చేయరు ఇల్లాళ్లు.

చక్కని చర్మం: నిజానికి తమ దేహం పట్ల కాస్త శ్రద్ధ, ప్రేమ చూపించవలసిన అవసరం, ఇష్టం ఆడవాళ్లకు ఉండాలి. చర్మ సంబంధిత ఉత్పత్తులు వాడటం, సౌందర్య చికిత్సలు చేయించుకోవటం వల్ల సౌందర్యం రాదు. ఆరోగ్యవంతమైన చర్మం పోషకాహారం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఎ, ఇ, సిలు, చాలినం త నిద్ర చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం ఆరోగ్యానికి దోహ దం చేసే కొలాజిన్, ఎలాస్టిన్‌లో విచ్ఛిన్నం అయితే చర్మం వదులుగా సాగినట్లు అయిపోతుంది. ముఖంపై ముడతలు, గీతలు, 30ఏళ్లు దాటుతుండగానే వస్తూ ఉంటే వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. కొలాజన్ ఉత్పత్తి చేసే ఒమేగా ౩ ప్యాటీయాసిడ్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే

ప్రొటీన్‌లో విటామిక్స్ వంటి పోషకాలు శరీరానికి అందే లా చూసుకోవాలి. ఇవి కీలకంగా లభించే కూరగాయలు, పండ్లు, నట్స్, పప్పుధాన్యాలు, చేపలతో కూడిన సమతూలాహారం రోజూ తినే ఆహారంలో భాగంగా ఉండాలి. వాటిలోని పోషకాలు శరీరాన్ని తాజాగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎంతమంది గృహిణులు తమకోసం ఇలాంటి పుష్టికరమైన ఆహారం తయారు చేసుకుని తింటున్నారు అంటే సందేహమే. ఇంట్లో అందరికోసం చేసిన ఆహారం పూర్తిగా చల్లారిపోయాక, వేళగాని వేళలో తీసుకుంటారు అంతే ఇదే వాళ్ల ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని, చర్మాన్ని, ఎముకలను పాడు చేస్తుంది.

ఒత్తిడే పెద్ద సమస్య: వ్యక్తిగతమైన వృత్తిపరమైన, శారీరకమైన, మానసికమైన సమస్యలను సవాళ్లను ఎదుర్కొనే తీరులో మహిళలు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్, కేన్సర్, గుండెజబ్బులు ఇలా అనేక అనారోగ్యాలకు ఒత్తిడే ప్రధాన కారణం. యాంగ్జయిటీ, డిప్రెషన్, నిద్రలేమి వంటివే ఒత్తిడికి కారణం. వీటికి కారణం అయ్యే పరిస్థితులను తలకిందులు చేయలేకపోవచ్చు గానీ అనుకూలమైన చర్యలు అవలంబించటం ద్వారా వాటిని ఎదుర్కోవచ్చు. క్రమం తప్పని వ్యాయామం, యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. జీవనశైలిలో కొన్ని శారీరక సంబంధమైన అనారోగ్యాలు తలెత్తితే వాటిని సరైన సమయంలో వైద్యుని దగ్గరకు తీసుకు వెళ్లగలిగితే పర్లేదు.

కేవలం నిర్లక్షం కారణంగానే ఎంతోమంది మహిళలు పూర్తిగా పడక మీదకి ఎక్కేవరకు గుర్తించేందుకు కూడా ఇష్టపడరు. మౌనంగా భరిస్తారు. ఈ క్రమంలో కలిగే అనవసరపు అయోమయం, చిరాకు, కోపం వంటివి దైనందిన కార్యకలాపాలకు ఎంత అడ్డం వచ్చినా భరిస్తూపోయి మరింత ప్రమాదం కొని తెచ్చుకుంటారు. అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు ఉంటాయి. బరువు తగ్గే ప్రయత్నాలు చేయవచ్చు. స్విమ్మింగ్, ఏరోబిక్స్, పవర్‌యోగా, డాన్స్ ఏదైనా మొదలుపెట్టవచ్చు. మంచి క్వాలిటీ గల ఆహారం శ్రద్ధగా తీసుకోవచ్చు. లేవగానే పచ్చని పచ్చికలో నడిచి నిద్రలేచిన అరగంటకు బ్రేక్‌ఫాస్ట్ ముగించి పనుల్లోకి దిగచ్చు. శారీరక సౌందర్యం పట్ల కాస్త దృష్టిపెట్టి మనసుని సంతోషపెట్టవచ్చు.

ఒత్తిడి అనిపిస్తే, కాస్త విశ్రాంతి తీసుకుని ఏ సంగీతమో వినచ్చు. ఓ గంట మంచి పుస్తకం చదువుకోవచ్చు. దైవప్రార్థనలో మునిగిపోవచ్చు. అలసట, చిరాకు వంటి అనారోగ్యం తలెత్తితే వెంటనే డాక్టర్‌ని కలుసుకోవాలి. ముందుగా కుటుంబసభ్యులతో మనసు విప్పి మాట్లాడాలి. శక్తికి మించిన ఇంటి పనుల్లో వాళ్ల భాగస్వామ్యం తీసుకోవచ్చు. ఇవన్నీ ఆరోగ్యం కోసం చేపట్టిన చర్యలు. ఒక్కవిషయం గుర్తు పెట్టుకోవాలి.. గృహిణి వేయి చేతులతో పనిచేస్తేనే కుటుంబం సజావుగా నడుస్తుంది. ఆ ఓపిక పోగొట్టుకుని ఇంటినీ పిల్లలను, కుటుం బ సభ్యులను కష్టపెట్టవద్దు. ఇల్లాలి ఆరోగ్యంపైనే ఇంటి క్షేమం ఆధారపడి ఉంటుంది.

Lifestyle Factors Affecting Health

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆమె ఆరోగ్యమే కుటుంబానికి రక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: