ప్రభాస్‌ కథను నమ్మి ఈ సినిమా చేశాడు: రాజమౌళి

  హైదరాబాద్‌: హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’. ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఆదివారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి, వివి వినాయక్, అల్లు అరవింద్, దిల్ రాజ్ తదితరులు హాజరయ్యారు. […] The post ప్రభాస్‌ కథను నమ్మి ఈ సినిమా చేశాడు: రాజమౌళి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’. ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఆదివారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి, వివి వినాయక్, అల్లు అరవింద్, దిల్ రాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. ‘సాధారణంగా ఏ హీరో అభిమాని అయినా తన హీరో సినిమా హిట్‌ కావాలని కోరుకుంటారు. కానీ, అందరి హీరోల అభిమానులు ప్రభాస్‌ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్‌ అన్ని విషయాల్లోనూ పాజిటివ్‌గా ఉంటాడు. ‘బాహుబలి’ తీస్తున్న సమయంలోనే తన తర్వాత చిత్రమేంటో ప్రభాస్‌ ఆలోచించారు.

ఒక రోజు నా దగ్గరకు వచ్చి సుజీత్‌ కథ గురించి నాకు చెప్పాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే.. పెద్ద సినిమా చేసిన తర్వాత, పెద్ద డైరెక్టర్‌తో చేయాలని కాకుండా, సుజీత్‌ చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేశాడు. ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమా అయితే, నా ఫ్యాన్స్‌కు నచ్చుతుంది అని చెప్పి చేశాడు. ఇంత పెద్ద సినిమాను సుజీత్‌ చేస్తాడా? అని చాలా మందికి అనుమానం ఉంది. ఫస్ట్‌లుక్‌ చూసినప్పుడే సినిమా స్థాయి ఏంటో తెలిసింది. టీజర్‌తో అది నిజమని అనిపించింది. ట్రైలర్‌తో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. చాలా బాగా చేశాడు. అంత పెద్ద టెక్నీషియన్స్‌, బడ్జెట్‌,  స్టార్స్‌ను పెట్టుకుని చేయడం మామూలు విషయం కాదు. ఒక ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌లా సినిమా చేశాడు. ఇలాంటి సినిమా తీయాలంటే నిర్మాతలకు ఎంతో ధైర్యం ఉండాలి. నిజంగా వాళ్లను అభినందిస్తున్నా. ఆగస్టు 30న పెద్ద రికార్డులు సృష్టిస్తుంది. ప్రభాస్‌ ఇప్పటికే ఆలిండియా స్టార్‌. ఇక సినిమాతో ఎంతో మరో మెట్టు ఎదుగుతాడు’ అని అన్నాడు.

Rajamouli speech at Saaho movie pre release event 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రభాస్‌ కథను నమ్మి ఈ సినిమా చేశాడు: రాజమౌళి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: