‘సాహో’ ప్రీ రిలీజ్…జనసంద్రమైన ఫిలిం సిటీ

హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’. ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ‘సాహో’ విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇటు ప్రభాస్ భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను మరింతగా పెంచేలా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా […] The post ‘సాహో’ ప్రీ రిలీజ్… జనసంద్రమైన ఫిలిం సిటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’. ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ‘సాహో’ విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇటు ప్రభాస్ భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను మరింతగా పెంచేలా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో సాహో సినిమాలో వాడిన కొన్నింటిని అభిమానులు వీక్షించడానికి వరల్డ్ ఆఫ్ సాహో పేరుతో ప్రజెంట్ చేశారు. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున అభిమానులు రావడంతో వేదిక కిక్కిరిసిపోయింది. ఫిలిం సిటీ పరిసర ప్రాంతమంతా జనసంద్రమైంది. ఇక వేదిక వద్ద అభిమానులను కట్టడి చేయడం పోలీసుల వల్ల కూడా కావడం లేదు. ఈ వేడుకను అందరూ వీక్షించేలా వేదిక వద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

Saaho movie pre release event updates

The post ‘సాహో’ ప్రీ రిలీజ్… జనసంద్రమైన ఫిలిం సిటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: