బికారి అయిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్…(ఫోటో వైరల్)

  పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బికారిగా మారిపోయాడు. అదేంటీ.. ఇమ్రాన్ పాక్ ప్రధానిగా, అప్పుడే బికారీ ఎలా అయ్యాడు అనుకుంటున్నారు కదూ. ఇది నిజమా, కాదా అని మీరే తేల్చుకోవచ్చు. జస్ట్, గూగుల్‌లో బికారీ అని ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే  చాలూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలు ప్రత్యక్షం అవుతాయి. ఇది ఎవరు చేశారో గానీ, ఇమ్రాన్ ఖాన్ మాసిపోయిన గడ్డం, మీసాలతో కూడిన ఫొటో దర్శనమిస్తోంది. దీంతోపాటు ఆయన చేతిలో రేకు డబ్బా […] The post బికారి అయిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్…(ఫోటో వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బికారిగా మారిపోయాడు. అదేంటీ.. ఇమ్రాన్ పాక్ ప్రధానిగా, అప్పుడే బికారీ ఎలా అయ్యాడు అనుకుంటున్నారు కదూ. ఇది నిజమా, కాదా అని మీరే తేల్చుకోవచ్చు. జస్ట్, గూగుల్‌లో బికారీ అని ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే  చాలూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలు ప్రత్యక్షం అవుతాయి. ఇది ఎవరు చేశారో గానీ, ఇమ్రాన్ ఖాన్ మాసిపోయిన గడ్డం, మీసాలతో కూడిన ఫొటో దర్శనమిస్తోంది. దీంతోపాటు ఆయన చేతిలో రేకు డబ్బా పట్టుకుని అడుక్కుంటున్నట్టుగా  ఫొటోలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద విదేశీ ద్రవ్య నిల్వలు 7.76 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయి. ఇది బంగ్లాదేశ్ కంటే కూడా చాలా తక్కువ. బంగ్లాదేశ్‌లో 32 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ ద్రవ్య నిల్వ ఉంది. జీడీపీ కూడా 4శాతానికి పరిమితం అయింది. 2019 జూన్‌లో పాకిస్తాన్ ద్రవ్యోల్బణం 8.9 శాతంగా నమోదైంది. కొన్ని రోజుల క్రితం ఇలాగే టాయిలెట్ పేపర్ అని గూగుల్‌లో టైప్ చేస్తే పాకిస్తాన్ జాతీయ జెండా దర్శనమిచ్చింది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇడియట్ అని గూగుల్‌లో టైప్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఫొటో కనిపించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు గూగుల్ సిఈవొ సుందర్ పిచాయ్‌ను కూడా ప్రశ్నించాడు.

Search for bhikhari in google shows Pak PM Photos

The post బికారి అయిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్…(ఫోటో వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: