ఇక చర్చలు ఉంటే పిఒకెపైనే : రాజ్ నాథ్

హరియాణా : పాక్ తో చర్చలు జరిగితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఒకె)పైనే ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ఉగ్రవాదులను పెంచిపోషించడం మానుకున్నప్పుడే పాక్ తో చర్చలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లో పాక్ తో చర్చలు జరిగితే అది పిఒకెపైనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. హరియాణాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. […] The post ఇక చర్చలు ఉంటే పిఒకెపైనే : రాజ్ నాథ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హరియాణా : పాక్ తో చర్చలు జరిగితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఒకె)పైనే ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ఉగ్రవాదులను పెంచిపోషించడం మానుకున్నప్పుడే పాక్ తో చర్చలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లో పాక్ తో చర్చలు జరిగితే అది పిఒకెపైనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. హరియాణాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత పాక్ తీవ్ర ఆందోళనకు గురవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకోవాలని పాక్ యత్నించిందని, అయితే పాక్ విన్నపాలను ప్రపంచదేశాలు పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులను అడ్డుపెట్టుకుని భారత్ లో అల్లర్లు సృష్టించేందుకు పాక్  కుట్రలు చేస్తుందని, ఎటువంటి పరిస్థితినైనా భారత్ ఎదుర్కొంటుందని ఆయన వెల్లడించారు.

Union Minister Rajnath Singh Comments On Pak

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇక చర్చలు ఉంటే పిఒకెపైనే : రాజ్ నాథ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: