టీమిండియాకు బ్రియన్ లారా విందు…

  వెస్టీండీస్ పర్యటనలో టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇక, గురువారం నుంచి ఆంటిగ్వా వేదికగా విండీస్-భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో ఇరుజట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ను ప్రారంభించనున్నాయి. కాగా, ఈ టెస్టు మ్యాచ్ కు ముందు విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా తన నివాసంలో టీమిండియా జట్టుకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో […] The post టీమిండియాకు బ్రియన్ లారా విందు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వెస్టీండీస్ పర్యటనలో టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇక, గురువారం నుంచి ఆంటిగ్వా వేదికగా విండీస్-భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో ఇరుజట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ను ప్రారంభించనున్నాయి. కాగా, ఈ టెస్టు మ్యాచ్ కు ముందు విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా తన నివాసంలో టీమిండియా జట్టుకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, కేదర్ జాదవ్ తోపాటు విండీస్ ఆటగాళ్ళు డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటలను బ్రావో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. తమ జట్టు ఆటగాళ్లతో పాటు టీమిండియా సోదరులకు లారా తన నివాసంలో విందు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు.

టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ లో క్రిస్ గేల్ రికార్డు నెలకొల్పాడు. విండీస్ తరుఫున 300 వన్డేలు ఆడిన క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటివరకూ బ్రియాన్ లారా పేరుమీదున్న ఈ రికార్డును గేల్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా మూడో వన్డేలో గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో కేవలం 41 బంతుల్లోనే 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక, గేల్ వన్డేలో మొత్తం 10,405 పరుగులు చేశాడు.

View this post on Instagram

Lefty aur lefty ka ultimate combo

@brianlaraofficial

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

Brian Lara hosted party for Indian team and West Indies 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టీమిండియాకు బ్రియన్ లారా విందు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: