నాణ్యమైన విద్యుత్ అందించాలి : కెసిఆర్

హైదరాబాద్ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను అందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సిఎం కెసిఆర్ తేల్చి చెప్పారు. జెన్ కో , ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎండి రాజేశ్ శర్మలు ఆదివారం ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని కెసిఆర్ సన్మానించారు. దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాలని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ భారంతంలో విద్యుత్ కోత అనేదే లేకుండా […] The post నాణ్యమైన విద్యుత్ అందించాలి : కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను అందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సిఎం కెసిఆర్ తేల్చి చెప్పారు. జెన్ కో , ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎండి రాజేశ్ శర్మలు ఆదివారం ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని కెసిఆర్ సన్మానించారు. దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాలని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ భారంతంలో విద్యుత్ కోత అనేదే లేకుండా చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొన్నామని, ఆరు నెలల్లోనే సమస్యను అధిగమించామని కెసిఆర్ తెలిపారు. విద్యుత్ సమస్య పరిష్కారమైనప్పుడే అభివృద్ధి సాధ్యం కాదన్న ఆలోచనతో ముందుకు సాగినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని ఆయన చెప్పారు.

Provide Quality Electricity To People : CM KCR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నాణ్యమైన విద్యుత్ అందించాలి : కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: