రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

తూర్పుగోదావరి : ప్రత్తిపాడు మండలంలోని ధర్మపురం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు. మృతులు మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరు తలుపులమ్మ లోవ ఆలయానికి […] The post రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తూర్పుగోదావరి : ప్రత్తిపాడు మండలంలోని ధర్మపురం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు. మృతులు మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరు తలుపులమ్మ లోవ ఆలయానికి వెళ్లి ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. శవపరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Three People Dead In Road Accident At East Godavari

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: