వెయిటర్‌ను కాల్చి చంపిన కస్టమర్…

పారిస్: ఇచ్చిన ఆర్డర్ శాండ్ విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడన్న కారణంతో వెయిటర్ ని ఓ కస్టమర్ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. తూర్పు పారిస్ లోని నాయిసీలే గ్రాండ్ రెస్టారెంట్ కు వెళ్లిన ఓ వ్యక్తి శాండ్ విచ్ ఆర్డర్ చేశాడు. దీంతో వెయిటర్‌ ఆర్డర్ తీసుకొని చెఫ్‌లకు చెప్పాడు. ఇంతలో మళ్లీ వెయిటర్‌ను పిలిచిన కస్టమర్ తనకు వెంటనే సాండ్‌విచ్ తెచ్చివ్వాలన్నాడు. అలా వెంటనే తెచ్చివ్వడం కుదరదు అన్న వెయిటర్ […] The post వెయిటర్‌ను కాల్చి చంపిన కస్టమర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పారిస్: ఇచ్చిన ఆర్డర్ శాండ్ విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడన్న కారణంతో వెయిటర్ ని ఓ కస్టమర్ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. తూర్పు పారిస్ లోని నాయిసీలే గ్రాండ్ రెస్టారెంట్ కు వెళ్లిన ఓ వ్యక్తి శాండ్ విచ్ ఆర్డర్ చేశాడు. దీంతో వెయిటర్‌ ఆర్డర్ తీసుకొని చెఫ్‌లకు చెప్పాడు. ఇంతలో మళ్లీ వెయిటర్‌ను పిలిచిన కస్టమర్ తనకు వెంటనే సాండ్‌విచ్ తెచ్చివ్వాలన్నాడు. అలా వెంటనే తెచ్చివ్వడం కుదరదు అన్న వెయిటర్ లోపల ప్రిపేర్ చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత అతను వెయిటర్ తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం కస్టమర్ తన వెంట తెచ్చుకున్న తుపాకితో వెయిటర్ ను కాల్చాడు. బుల్లెట్ వెయిటర్ భుజంలోకి దూసుకేపోవడంతో అతను అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. రెస్టారెంట్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

french waiter shot dead over slow sandwich service

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వెయిటర్‌ను కాల్చి చంపిన కస్టమర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: