అవార్డు అమ్మకు అంకితం

* చిన్నతనంలో కీర్తి సురేష్ స్విమ్మింగ్ బాగా చేసేదట. తన ఇంటి దగ్గరున్న ఓ శిక్షణా కేంద్రంలో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. పాఠశాల, కళాశాలలో జరిగే నృత్య, నాటన ప్రదర్శనల్లోనూ చురుగ్గా పాల్గొనేది. చదువులోనూ ముందుండేది. * మాస్, క్లాస్ సినిమాలతో ఆల్‌రౌండర్ అనిపించుకున్న కీర్తి డిజైనర్‌గా రాణి ంచాలనుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. భవిష్యత్తులో సొంతంగా బొటిక్‌ను ప్రారంభిస్తానని చెప్పే కీర్తి.. ఇటీవల తను సొంతంగా డిజైన్ చేసిన దుస్తుల్ని ఆమె […] The post అవార్డు అమ్మకు అంకితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

* చిన్నతనంలో కీర్తి సురేష్ స్విమ్మింగ్ బాగా చేసేదట. తన ఇంటి దగ్గరున్న ఓ శిక్షణా కేంద్రంలో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. పాఠశాల, కళాశాలలో జరిగే నృత్య, నాటన ప్రదర్శనల్లోనూ చురుగ్గా పాల్గొనేది. చదువులోనూ ముందుండేది.

* మాస్, క్లాస్ సినిమాలతో ఆల్‌రౌండర్ అనిపించుకున్న కీర్తి డిజైనర్‌గా రాణి ంచాలనుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. భవిష్యత్తులో సొంతంగా బొటిక్‌ను ప్రారంభిస్తానని చెప్పే కీర్తి.. ఇటీవల తను సొంతంగా డిజైన్ చేసిన దుస్తుల్ని ఆమె ట్విటర్‌లో షేర్ చేసింది.

* ‘వసంత కోకిల’లో శ్రీదేవి,
’క్వీన్’లో కంగన, ’కహానీ’లో విద్యాబాలన్ పోషించిన రోల్స్ అంటే ఇష్టమట. అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని చెబుతోంది. ప్రతి పాత్రా తనకు ఛాలెంజింగ్‌గానే ఉంటుందని అంటోంది.

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ మూడు పురస్కారాలు గెలుచుకుంది. సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కైవసం చేసుకుంది. తన మాతృమూర్తి మేనకకు తొలి మలయాళం సినిమాకు జాతీయ అవార్డు రావాల్సిందని.. కానీ కొద్దిలో జారిపోయిందని, అందుకే ఆమెకు ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నట్టు కీర్తి వెల్లడించింది. మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి  మేనకల కుమార్తె కీర్తి. 2000లో బాలనటిగా తెరంగేట్రం చేసింది.

తండ్రి నిర్మాతగా  వ్యవహరించిన మలయాళ చిత్రం ‘పైలట్స్’ ఆమె తొలి సినిమా. దీంతోపాటు ‘అచనేయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’ తదితర చిత్రాల్లో, కొన్ని సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకుంది. హీరోయిన్‌గా ఆమె మొదటి సినిమా ఆరేళ్ల కిందట మలయాళంలో వచ్చిన ’గీతాంజలి’. 2016లో ‘నేను శైలజ’తో కీర్తి తెలుగు చిత్రరంగంలో ప్రవేశించింది.

* స్వతహాగా శాకాహారి అయిన కీర్తి సురేష్ వ్యాయామం, యోగాకు అధిక ప్రాముఖ్యం ఇస్తుంది. ఇన్నాళ్లూ కాస్త బొద్దుగా ఉన్న ఆమె ఇప్పుడు చాలా స్లిమ్‌గా తయారయింది. అందంగా తయారై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

* తమిళ స్టార్లు విజయ్, సూర్య అంటే కీర్తి సురేష్‌కు చాలా ఇష్టం. చిన్నతనం నుంచి విజయ్‌కు వీరాభిమాని. ‘భైరవ’ (2017)లో ఆయనకు జోడీగా నటించే అవకాశం వచ్చినందుకు తెగ సంతోషపడింది. ఇక సూర్య యాక్షన్ సినిమా ‘సింగం’ అంటే కూడా కీర్తికి ఎంతో ఇష్టం.

* సావిత్రి గారికీ నాకూ కొన్ని పోలికలున్నాయి. కొన్ని విషయాల్లో ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉంటాయి. అందుకే ఈ మహానటిలో అవకాశం వచ్చిందేమో అనిపించింది. సినిమా చేస్తున్నప్పుడు ‘ఇదివరకెప్పుడూ చేయని పాత్ర, ఇంకెప్పుడూ చేయలేని పాత్ర నా దగ్గరకు వచ్చింది’ అనుకుంటూనే పనిచేసేదాన్ని అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

Keerthy Suresh won National Best Actress Award

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అవార్డు అమ్మకు అంకితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.