మిషన్ భగీరథతో కెసిఆర్ కల సాకారం

అవగాహన సదస్సులో పలువురు ప్రజాప్రతినిధుల ప్రశంసలు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగవ్వాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కన్న కలమిషన్ భగీరథ తో సాకారం అయిందని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవాపూర్ లో మిషన్ భగీరథ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిగి ఎంఎల్‌ఎ మహేష్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరికీ శుద్దిచేసిన మంచి నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం […] The post మిషన్ భగీరథతో కెసిఆర్ కల సాకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అవగాహన సదస్సులో పలువురు ప్రజాప్రతినిధుల ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగవ్వాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కన్న కలమిషన్ భగీరథ తో సాకారం అయిందని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవాపూర్ లో మిషన్ భగీరథ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిగి ఎంఎల్‌ఎ మహేష్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరికీ శుద్దిచేసిన మంచి నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణమని, ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరే అని ప్రశంసించారు. భగీరథ నీరు మాత్రమే సురక్షితమని చెప్పారు. ప్రజలంతా ఈ నీటినే తాగాలని కోరారు. తన నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు బల్క్ గా సరాఫర అవుతుందన్నారు. అందుకే పోయిన ఎండాకాలంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాలేదన్నారు.నిత్యం ప్రజల మధ్య ఉండే సర్పంచులు, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, ఎంపిపిలతో పాటు ఎంపిడిఒ, పంచాయితీ సెక్రెటరీలకు భగీరథ పై అవగాహన కల్పించడం మంచి నిర్ణయమన్నారు. ఇవాళ తెలుసుకున్న, చూసిన విషయాలను ప్రజలకు వివరించి భగీరథ నీటిని మాత్రమే తాగేలా చైతన్య పరచాలని స్థానిక ప్రజాప్రతినిధులను మహేష్ రెడ్డి కోరారు.

ఆర్‌వో నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదన్న సంగతిని ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ అవగాహన సదస్సును నిర్వహించామన్నారు మిషన్ భగీరథ ఈఎన్ సి కృపాకర్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మిష న్ భగీరథలో నీటిని శుద్దిచేస్తామన్నారు. నెల రోజుల పాటు రాఘవాపూర్ నీటి శుద్ది కేంద్రానికి సామాన్య ప్రజలు కూడా రావొచ్చన్నారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు తమ తమ గ్రామస్తులను తీసుకొచ్చి మిషన్ భగీరథ నీరు ఎంత స్వచ్చం, సురక్షితమో తెలియచేయాలని కోరారు. త్వరలోనే రాష్ట్రం లోని 50 నీటి శుద్ది కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంతే కాకుండా తమ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్య పరుస్తారని తెలిపారు. 200 కిలోమీటర్ల దూరం లోని శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ను తీసుకొచ్చి వికారాబాద్ జిల్లాకు అందిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎంఎల్‌ఎ, ఈఎన్‌సి దృష్టికి తీసుకొచ్చారు.

వికారాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పనులు మొత్తం పూర్తయ్యాయని మరో మూడు నెలల్లో గ్రామాల్లోని రోడ్లను పునరుద్దరిస్తామని ఈఎన్‌సి హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి నీటిని సరాఫరా చేసినంకనే ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు ప్రకటిస్తామన్నారు. అంతకుముందు స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయితీ అధికారులు నీటి శుద్ది కేంద్రాన్ని పరిశీలించారు. ఈ.ఈ నరేందర్ వారికి నీరు శుద్ధి అయ్యే క్రమాన్ని, విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్లు వినోభాదేవి, శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఈ ఆంజనేయులు, డి.ఈ ప్రవీణ్, కన్సల్టెంట్ జగన్ తో పాటు పరిగి మండల స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయితీ సెక్రెటరీలు పాల్గొన్నారు.

Parigi MLA Mahesh Reddy Speech At Public Meeting

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మిషన్ భగీరథతో కెసిఆర్ కల సాకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: