కాపుల ఆశ్రిత గోత్రాల కళాకారులు

ఈ కళాకారులు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిలాపూర్, సైదాపూర్, బూడిద పల్లి వెంకటేశ్వర పల్లి, రేగులపల్లె, హుస్నాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాజిపల్లి, జైపూర్, బెజ్జాల, గెరక పల్లి, సిద్దిపేట జిల్లా ఇబ్రహీం నగర్ నిజామాబాద్ పట్టణ కేంద్రం,ఆర్మూర్, మంథని, బోధన్, భీంగల్, రాగుట్ల, రంగారెడ్డి లోనూ స్థిరపడి 12 బృందాలుగా ఏర్పడి కట్టడి గ్రామాల్లో ప్రదర్శనలిస్తూ మనుగడలో ఉన్నారు. వీరి ఇంటిపేర్లలో కొంక్యాల, తిపిరిశెట్టి, బత్తిని, చిందం నరెడ్ల, తాళ్ల, చిలుకాని, గందెశ్రీ, ఇటిక్యాల, […] The post కాపుల ఆశ్రిత గోత్రాల కళాకారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈ కళాకారులు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిలాపూర్, సైదాపూర్, బూడిద పల్లి వెంకటేశ్వర పల్లి, రేగులపల్లె, హుస్నాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాజిపల్లి, జైపూర్, బెజ్జాల, గెరక పల్లి, సిద్దిపేట జిల్లా ఇబ్రహీం నగర్ నిజామాబాద్ పట్టణ కేంద్రం,ఆర్మూర్, మంథని, బోధన్, భీంగల్, రాగుట్ల, రంగారెడ్డి లోనూ స్థిరపడి 12 బృందాలుగా ఏర్పడి కట్టడి గ్రామాల్లో ప్రదర్శనలిస్తూ మనుగడలో ఉన్నారు. వీరి ఇంటిపేర్లలో కొంక్యాల, తిపిరిశెట్టి, బత్తిని, చిందం నరెడ్ల, తాళ్ల, చిలుకాని, గందెశ్రీ, ఇటిక్యాల, మేళ్ల, మడికొండ,పడిగె, కుమ్మరి ఉన్నాయి. వీరి గోత్రం కూడా కాపు వారికి ఉండే పస్పునూల గోత్రమే ఉంటుంది. కానీ ఒకరికొకరు సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం లేదు. కేవలం కంచం పొత్తు మాత్రమే ఉంటుంది.

తెలంగాణలోని ఆశ్రిత జానపద కళారూపాల్లో గోత్రాల కళారూపం ప్రత్యేకమైంది. మనుగడ కోసం పరిణామం చెందిన కళారూపాల్లో గోత్రాల కళారూపం ఒకటి. కళాకారులు వంశపారంపర్యంగా మున్నూరు కాపు, చౌదరి, రెడ్డి గాండ్ల ్,గోనె కాపు వంశవృక్షాన్ని,గోత్రాన్ని కీర్తిస్తూ ,తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. గోత్రం అంటే మూల పురుషుడని ,గోవులను రక్షించేవాడని అర్థాలున్నాయి. అయితే ఈ కళాకారులు కాపుల గోత్రాన్ని కీర్తించడం తోనే తమకు ఆ పేరు వచ్చిందని చెబుతారు.
గోత్రాల వారి కులోత్పత్తి
తమ కులం పుట్టుక గురించి గోత్రాల ఎల్లయ్య ,సంతోష్ ఈ కింది విధంగా వివరించారు. సృష్టి ఆరంభంలో త్రిమూర్తులు జన్మిస్తారు .ఆ తర్వాత సకలజనుల తో పాటుగా 12 కాపు కులాలు ఉద్భవిస్తాయి. ఆ పరమ శివుడు 116 గోత్రాలను పంచమని శింగర శిష్యున్ని సృష్టించి ఆదేశిస్తాడు. అయితే మున్నూరు కాపు కులం లో ఐదుగురు అన్నదమ్ముల తోబుట్టువుగా అంకెమ్మ అనే ఆడపడుచు పుడుతుంది. ఆమెకు అన్నదమ్ములు ఆస్తులు భూములు పంచకపోవడంతో శివుణ్ణి అర్థిస్తుంది .పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి అర్థం చేసుకొని ,పార్వతి ఒక పసుపు ముద్ద చేసి శివుని చేతికిస్తుంది. అంకెమ్మకు ఏ ఆధారం లేదని శివుడు, ఆ పసుపుముద్దనే పస్పునూల గోత్ర మై ఆమెకు ఆధారం అవుతుందని ,చేతికిచ్చి పంపుతాడు. ఆమె దాన్ని తీసుకెళ్లి దాచుకుంటుంది. అయితే ఆ మె ఐదుగురు అన్నదమ్ముల్లో ని పెద్ద కొడుకు పెళ్లి చేసే సమయంలో పంతులు వారి గోత్రం చెప్పమంటాడు. అప్పుడు వారు గోత్రం లేదనటంతో పెళ్లి చేయ నంటాడు పంతులు. అప్పుడు అన్న దమ్ము లు అంకెమ్మ దగ్గరికి వెళ్లి తమకు గోత్రం చెప్పమనగా ,ఆమె పసుపు ముద్దను వారికి సగం ఇచ్చి పస్పునూల గోత్రం అని చెబుతుంది .ఈ రకంగా గోత్రం చెప్పడంతో అంకెమ్మ సంతతియే గోత్రాల వారుగా మారారని అంటారు.ఆ పసుపుముద్దను చెరి సగం తీసుకోవడంతో గోత్రాల వారికి పస్పునూల గోత్రమే ఉంటుందని చెప్తారు.
కళాకారులు ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత ప్రదర్శన నిమిత్తం సంచారం చేయడానికి కట్టడి గ్రామాలకు బయలుదేరుతారు. ఈ రకంగా వెళ్ళేముందు ఒక మంచి రోజున కళాకారులు మేళం గా ఏర్పడతారు. ఈ రోజున ప్రదర్శనలో ఉపయోగించే వాద్యాలు, ఆభరణాలు వస్తువులు ,తాళపత్ర ప్రతులు అన్నింటిని నరసింహ స్వామి ముందు ఉంచి పూజ చేసుకుంటారు .దీనినే పెట్టె పూజ అని పిలుచుకుంటారు. ఇదే రోజు కళాకారులు కట్టడి గ్రామాల్లో వచ్చే ప్రతిఫలం పంపకాల గురించి మాట్లాడుకుంటారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కట్టడి గ్రామానికి వెళ్లి మొదట కాపు కుల పెద్దలను కలుస్తారు. తమకు వంశపారంపర్యంగా వస్తున్న హక్కులను గుర్తుచేసి ,తమ దగ్గర ఉండే తాళపత్ర ప్రతులను రాగి పత్రాలను చూపించి భాగోతాలు ప్రదర్శించే విషయమై చర్చించుకుని త్యాగం నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత కళాకారులు కాపుల ప్రతి ఇంటికి వెళ్లి వారి వంశ వృక్షాన్ని గోత్రాన్ని ఈ రకంగా కీర్తిస్తారు.
‘శ్రీ నాయ కాశీ వల్ల శేవ్య కులాది మారుంగాది పరుశరాముండవు…, ఉత్తరాన జేద్యంబు గాలి చేతి కర్పూర మా హనుమంతుని చేతి హస్త రేఖలు రాసినారు. పాతాళ మందు పనులు చేపట్టినారు. కొండ్రవేలుగ దున్ని కోటికి పడగెత్తినారు. వాల్యం బులు దున్ని వెల రాజుల బండ్లు వెత్తించినారు. ……, బసవ శంకర బిరుదు పసుపునూల గోత్రాన పేరుద్ధరించినారు. చాల్వాది గొల్వంగ, చంద్ర కూ లాంకురం అర్థ్తి దీవన, ఆడబిడ్డ దీవెన ,శివ దీవెన, బ్రహ్మ దీవెన, బసవయ్య దీవెన,నోరులేని కైలిగంగ్యావు దీవెనకలిగి జయీభవ, దిగ్విజయీభవ, అంటూ దీవె నార్తి పెడతారు.
కళాకారులు కాపు వారి ఇంటిలో భోజనం చేసే ముందు కూడా ఈ రకంగా దీవెన చేస్తారు.
‘ధనం ధాన్యం పరాశబ్రహ్మ పుత్రలాభం శత సంవత్సరం మేదిని సాగనాంతం, కోటి కన్న ప్రదానం పచ్చని కల్యాణంబు ,పచ్చని తోరణంబులు గౌరీ కంకణం బు శ్రీ శోభనంబు యాటాట పెళ్లిళ్లు మే లు కీర్తనలు ఏటికి ఎడ్లు గ లిగి పాటికి బర్లు కలిగి చిన్న ల్యాగలు, మీ మంద బాగా సంపతి కలిగి కలవారై గంభీరులై సకలోమనుమనులై, జయం జయ ం మీ లోగిలి వర్ధిల్లవలె విజయీభవ దిగ్విజయీభవ అని దీవనార్తి పెడతారు. గోత్రాలవారు వంశపారంపర్యంగా మున్నూరు కాపులనే కాకుండా పాకనాటి, మోటాటి, గోనె కాపు, పంటి రెడ్డి ,సీమకాపు చిట్టెపు, చౌదరి, కమ్మ కాపు, సద్గుణాటి, రెడ్డి గాండ్ల అనే మిగతా కాపులకు గోత్రాలు చెప్పి గోత్ర కట్నం స్వీకరిస్తారు. వీరితో పాటుగా వెలమల గోత్రాలను కీర్తించి కూడా గోత్ర కట్నం స్వీకరించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కళాకారులు రెడ్డి ,మున్నూరు కాపు ,గోనె కాపు, చౌదరి కాపు, రెడ్డి గాండ్లను మాత్రమే ఆశ్రయించి తమకు కట్టడి ఉన్న గ్రామాలకు వెళ్లి గోత్రాలను కీర్తించి ప్రతిఫలం పొందుతున్నారు. అయితే మున్నూరు కాపు వారికి ఒకే గోత్రం ఉండగా,మిగతా కాపులకు 116 గోత్రాలు ఉంటాయని వాటన్నింటిని భద్రపరుస్తూ కీర్తిస్తూ వస్తున్నారు.

గోత్రాలవారు చౌదరి, రెడ్డి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని దీవించే విధానంలో.. “రాచవళంబు హరిశ్చంద్రాదిఫలంబభు రాంగ రాంగ మీకు వైభో గ ఫలంభు / మెత్తని వర భూములు మేలని ధనా లు చాలు గట్టిన సవాలక్ష గుర్రాలు /యాడికాడిక పూదోటలు మంచి ఎకరా న బావులు మడ విడ చిత్రాలు / మామిడి వనం తరాలు భూమేలే రెడ్డి రాజా భూపాలాదిగనుండమా శాలోకాది/ మన్మ ధ…….జై యీభవ,దిగ్విజయీభవ..” అంటూ దీవిస్తారు. అలాగే వెలమలను దీవించే విధానం లో ‘కంచెల పద్మరాజుండమ గజగొండ పరుశరామముండమ సోమ కుల పరశురాముండ మ, అ మరించిన దుర్గంభు…….. 77 సింహాసనాలు, 77 రచ్చ లు గలుగు రాజులు జై భవ, విజయీభవ దిగ్విజయీభవ” అంటూ దీవిస్తారు. పూర్వం గోత్రాలవారు కాపుల వారి వంశాన్ని గోత్రాన్ని కీ ర్తించి గోత్ర కట్నం తీసుకునే వారు. ఈ రకంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వీర నాలు, ఉపంగం వాద్యాలు ఉపయోగించి మహాభారతంలోని 18 పర్వాలను కథాగాన రూపంలో ప్రదర్శించేవారు. ఈ రకంగా కూడా సరైన ఆదరణ లేకపోవడంతో ప్రస్తుతం భాగోతాల రూపంలో ప్రదర్శనలిస్తూ ఆదరణ పొందుతున్నారు. ప్రదర్శనలో పదిమంది వరకు కళాకారులు ఉంటారు. ఆరోజు ప్రదర్శించే కథను బట్టి కళాకారులు ఆయా పాత్రల వేషాలను వారే స్వయంగా వేసుకుంటారు.కథలోని స్త్రీ పాత్రలను మగవారు ధరిస్తారు.

భాగోతాన్ని ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ర సవత్తరంగా ప్రదర్శిస్తారు. ప్రదర్శనలో బఫూన్ పా త్ర కీలకంగా ఉంటుంది. రంగస్థలం మీదికి వ చ్చిన పాత్రను పరిచయం చేయడం, ప్రేక్షకులకు కలిగే సందేహాలను, తానే అడిగి నివృత్తి చేయడం, హాస్యాన్ని పండించడం ప్రధానంగా చేస్తాడు ప్రదర్శనకు పవిత్రతను ఆపాదించడం కోసం కళాకారులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకులను కూడా భాగస్వామ్యం చేస్తారు. భాగోతం రా త్రి సమయంలో ఆడినట్లు అయితే మొదటి రోజు విరామం తీసుకొని ఆ మరుసటి రోజు తిరిగి ఆడతారు. ఈ రకంగా కళాకారులు ఒక్కో గ్రామంలో పది నుండి పదిహేను రోజుల వరకు కాపుల అభిరుచి మేరకు ప్రదర్శిస్తారు. వీరు ప్రదర్శించే భాగోతాలలో మహాభారతం భాగవతం రామాయణం కథలతో పాటుగా ఇతర కథలు ఉంటాయి .వీటిలో ద్రౌపదీ స్వయంవరం, కిరాతార్జునీయం ,కీచకవధ, భద్ర సేన ,డాంగినేయం ,ధర్మాంగద, సుభ ద్ర విలాసం, సతీ సావిత్రి ,భక్త మార్కండేయ, సుం దరాకాండ, వాలి సుగ్రీవ ,బాలనాగమ్మ, భూకైలాసం, మొదలైన కథలు సుమారుగా 30 వరకు భాగోతాల రూ పంలో ఆడతారు. త్యాగం తీసుకొని ఆడే భాగోతాలు మాత్రమే కాకుండా కాపు, గోనె కాపు, చౌద రి కాపు, రెడ్డి గాండ్ల వారి ఇండ్ల లో ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకార్థంగా కూడా ప్రదర్శిస్తారు. ఆ సందర్భంలో కూడా పోషక కులాలు చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా గోత్రాల వారికి దానమిస్తారు.
తాళపత్ర ప్రతులు
తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన తాళపత్ర ప్రతులు తమ పూర్వీకులే, కాపుల వంశవృక్షాన్ని రాశారని కళాకారులు చెప్తారు. వాటిమీద కట్టడి గ్రామాల్లోని కాపుల ప్రతి కుటుంబం యొక్క వంశక్రమం ,పూర్వీకుల పేర్లు సుమారుగా 30 తంతెల వరకు రాయబడి ఉంటాయి. అందుకే గోత్రాల ఎల్లయ్య దగ్గర ఉన్న తాళపత్ర ప్రతులు నాలుగు వందల సంవత్సరాల కిందివని చెప్పటం జరిగింది. కళాకారులు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి గ్రామాలకు వెళ్ళగానే ,ఆ గ్రామంలోని కాపు వారికి కలిగిన పురుష సంతానాన్ని, కుటుంబాల సంఖ్యను రాసుకుంటారు .ఒకప్పుడు తాటికమ్మలమీద కొన్ని సంవత్సరాలు రాసుకోగా, ఆ తర్వాత దస్త్రాల మీద కొన్ని సంవత్సరాలు రాసుకున్నారు. ప్రస్తుతం నేటితరం పుస్తకాలలో రాసుకుంటూ భద్రపరుస్తున్నారు. ఈ తాళపత్ర ప్రతులను కళాకారులు స్థిరాస్తిగా భావించి గౌరవాన్ని ఆపాదిస్తారు.అలాగే వీరి దగ్గర ఉండే రాగి పత్రాల మీద మున్నూరు కాపు వారిని గోత్రాలవారు అర్థి ంచే హక్కు(మీరాశి) రాసి ఉంటుం.ఈ రాగి పత్రాలను కళాకారులు పవిత్రంగా చూసుకొంటారు.
నేటి స్థితి
కళాకారులు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిలాపూర్,సైదాపూర్ ,బూడిద పల్లి వెంకటేశ్వర పల్లి ,రేగులపల్లె, హుస్నాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాజిపల్లి, జైపూర్, బెజ్జాల, గెర క పల్లి, సిద్దిపేట జిల్లా ఇబ్రహీం నగర్ నిజామాబా ద్ పట్టణ కేంద్రం మరియు ఆర్మూర్ మంతిని బో ధన్ భీంగల్ రాగుట్ల, రంగారెడ్డి లోను కళాకారులు స్థిరపడి 12 బృందాలుగా ఏర్పడి కట్టడి గ్రామాల్లో ప్రదర్శనలిస్తూ మనుగడలో ఉన్నారు. వీరి ఇంటిపేర్లలో కొంక్యాల, తిపిరిశెట్టి, బత్తిని, చిందం నరెడ్ల, తాళ్ల, చిలుకానీ ,గందెశ్రీ ,ఇటిక్యా ల,మేళ్ల, మడికొ ండ, పడిగె, కుమ్మరి ఉన్నాయి. వీరి గోత్రం కూడా కాపు వారికి ఉండే పస్పునూల గోత్రమే ఉంటుంది. కానీ ఒకరికొకరు సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే సం ప్రదాయం లేదు. కేవలం కంచం పొత్తు మాత్రమే ఉంటుంది. ఈ కళాకారులకు మహారాష్ట్రలోని బల్లార్షా చుట్టు ప్రాంతాల్లో కూడా కట్టడి గ్రామాలు ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్లి వారి గోత్రాలను కీర్తించి వస్తారు. అలాగే తెలంగాణలో భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాంతంలోనే ఉండే రెడ్డి గాండ్ల దగ్గరికి వెళ్లి కూడా వారి గోత్రాలను కీర్తించి ప్రతిఫలం పొందటం జరుగుతుంది. ఇట్లా కళాకారులు తమకు వంశాను క్రమంగా సంక్రమించిన గ్రామాలకు వెళ్లి తమ సాంస్కృతిక నేపథ్యాన్ని అనుసరిస్తూ, తమ సంస్కృతిని నిలుపుకునే ప్రయత్నం చేస్తూవస్తున్నారు.

గోత్రాల కళాకారులు గత చరిత్రను వర్తమానంలో కీర్తిస్తూ ,వర్తమాన చరిత్ర ను భవిష్యత్తు తరాలకు అందించేలా వారి వంశ వృక్షాన్ని భద్రపరుస్తూ వస్తున్నారు, అంతేగాక వారి పూరీ్వికులను మననం చేస్తూ, వారిని పరిపరివిధాలుగా కీర్తిస్తూ ,వారి సంస్కృతిని సజీవంగా నిలుపుతున్నారు ,ఇదే కోవలో కళాకారులు వారికి వినోదాన్ని,ఇతిహాసాల గొప్పతనాన్ని నాటకాల రూప ంలో ప్రదర్శిస్తూ మనుగడ సాగిస్తున్నారు. వారు తమ సంస్కృతీ పరంపరను వర్తమానంలో కొనసాగించడానికి అనేక అవరోధాలను ఎదిరిస్తూ వస్తున్నారు. కట్టడి గ్రామాల్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల వీరికి గతంలో ప్రభుత్వం ఇ నాంగా ఇచ్చిన భూములను కూడా ఈ మధ్య కో ల్పోవడం జరిగింది. ఈ విషయమై గోత్రాల వారు సామూహికంగా పోరాడుతూనే ఉన్నారు. వీరికి ప్రదర్శనలు లే కుంటే ఖాళీగా ఉండే పరిస్థితి నెలకొని ఉం ది. ముఖానికి రంగు పులుముకొని గడపగడపకు కట్ట డి గ్రా మాల్లో తిరుగుతూ ఆశ్రితులుగా పిలువబడుతున్న వీరు, త మ సాంస్కృతిక జీ వనాన్ని గడపడానికి నిత్యం సమాజంలో అవరోధాలను ఎదుర్కొంటూ తమ కళ ను కాపాడుకుంటూ వస్తున్నారు.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాపుల ఆశ్రిత గోత్రాల కళాకారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: