ఉద్యమనేత వినోద్‌కుమార్‌కు క్యాబినెట్ పదవి

  హర్షం వ్యక్తం చేస్తున్న ఓరుగల్లు జిల్లా పార్టీ శ్రేణులు ఓరుగల్లుకు వినోద్‌కుమార్‌తో మేలు వరంగల్ : టిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌కు క్యాబినెట్ స్థాయి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్‌ఎస్ పార్టీతో పాటు అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన బోయినపల్లి వినోద్‌కుమార్ 2001 […] The post ఉద్యమనేత వినోద్‌కుమార్‌కు క్యాబినెట్ పదవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హర్షం వ్యక్తం చేస్తున్న ఓరుగల్లు జిల్లా పార్టీ శ్రేణులు
ఓరుగల్లుకు వినోద్‌కుమార్‌తో మేలు

వరంగల్ : టిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌కు క్యాబినెట్ స్థాయి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్‌ఎస్ పార్టీతో పాటు అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన బోయినపల్లి వినోద్‌కుమార్ 2001 ఏప్రిల్ 27న కెసిఆర్ నాయకత్వంలో ఏర్పడిన టిఆర్‌ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యునిగా తన తెలంగాణ రాష్ట్ర సాధన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి వినోద్‌కుమార్ పాత్ర అనిర్వచనీయం.

2001 నుంచి 2004 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమాన్ని రగల్చచడంలో వినోద్‌కుమార్ పాత్ర ప్రధానమైంది. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్ని అధిక స్థానాల్లో గెలుపొందడంలో వినోద్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. అదే ఊపుతో పార్టీ జిల్లాలో బలోపేతమైంది. 2004 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 12 అసెంబ్లీ స్థానాలకు, రెండు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసింది. హన్మకొండ పార్లమెంటు స్థానం నుంచి వినోద్‌కుమార్‌ను కేసీఆర్ ఎంపీగా భరిలో నిలిపారు. ఆ ఎన్నికల్లో వినోద్‌కుమార్ అనూహ్యమైన మెజార్టీతో గెలుపొందారు.

2004 నుంచి 2009 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తు పార్లమెంటులో కేసీఆర్‌తో కలిసి తెలంగాణ కోసం తన గలాన్ని వినిపించారు. 2009లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హన్మకొండ ఎంపీ స్థానం ఎస్సీకి రిజర్వ్‌డ్ కావడంతో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వరంగల్ ఉమ్మడి జిల్లాతోపాటు కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంటులో ఉద్యమ వ్యాప్తిని ఉధృతం చేయడంలో వినోద్‌కుమార్‌ది కీలక పాత్రగా కొనసాగింది. 2013లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కూడా కేసీఆర్ పక్కనే ఉండి ఢిల్లీలో తన వంతు పాత్రను పోషించారు. 2014లో జరిగిన పార్లమెంటులో ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా కరీంనగర్ పార్లమెంటు స్థానానికే పరిమితమయ్యారు.

2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా ఓటమి పాలైన వినోద్‌కుమార్ రాష్ట్ర పార్టీ కార్యకలాపాలను చూస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్న వినోద్‌కుమార్‌కు సముచితమైన స్థానం కల్పించి ఆయన సేవల్ని వినియోగించుకోవాల్సిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా నియమిస్తు క్యాబినెట్ స్థాయి పదవిని ఆయనకు కట్టబెట్టారు. కార్పోరేషన్ స్థాయి పదవి అయినప్పటికీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా క్యాబినెట్ ర్యాంకును కల్పించడంతో వినోద్‌కుమార్ మంత్రి స్థాయిలో తన సేవల్ని ప్రభుత్వపరంగా విస్తరించనున్నారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా నియమించబడే వరకు ఎంపీగా కేంద్రం వరకే పరిమితమయ్యారు.

ఈ పదవితో వినోద్‌కుమార్ రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలమైన పాత్రను పోషించనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకునే క్యాబినెట్ నిర్ణయాల్లో వినోద్‌కుమార్ కూడా పాల్గొంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వినోద్ కుమార్‌కు క్యాబినెట్ స్థాయి పదవి లభించడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాకు కలిసి వచ్చే అంశంగా ప్రజలు, పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు పూర్తిస్థాయి అవగాహన ఉంది. 2001 నుంచి తాను చేపట్టిన ఉద్యమ ప్రస్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్యేల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, టి. రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోతు శంకర్‌నాయక్‌లు ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

వినోద్‌కుమార్‌కు మంత్రి స్థాయి పదవిని కల్పించడంతో వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రి ర్యాంకు కల్గిన నేతలుగా పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రానున్నారు. 2001 నుంచి పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన క్యాడర్ నిరుత్సాహానికి గురైన సందర్భంలో వినోద్‌కుమార్‌కు రాష్ట్రస్థాయి పదవిని కట్టబెట్టడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారులకు మేలు చేసినట్లుగా భావిస్తు న్నారు. ప్రధానంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, అన్ని జిల్లాలకు చెందిన ఉద్యమకారులు వినోద్‌కుమార్‌ను కలిసి వారి బాధలను, సమస్యల్ని విన్నవించుకునే అవకాశం లభించినట్లయింది. ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించిన క్యాడర్‌కు ఉమ్మడి జిల్లాలో పెద్దదిక్కు లేకుండా పోయింది. వినోద్‌కుమార్ రాకతో ఉద్యమకారులకు పెద్ద పీట వేసినట్లుగా ఈ నియామకాన్ని భావిస్తున్నారు.

Vinod Kumar as Vice President of Planning Commission

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉద్యమనేత వినోద్‌కుమార్‌కు క్యాబినెట్ పదవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: