ఎస్‌ఐ యా.. మజాకా..

పోలీస్ సింహానికి కోపం కారుకు గేదెలు అడ్డొచ్చాయని 80 ఏళ్ల వృద్ధునిపై దాడి మోకాలుకు గాయం ఎస్‌ఐ తీరుపై పలువురి ఆగ్రహం   మన తెలంగాణ/పెద్దమందడి: పెద్దమందడి పోలీస్ సింహానికి కోపం వచ్చింది. శుక్రవారం రహదారిపై తన కారుకు అ డ్డువచ్చిన గేదెలను పక్కకు కొట్టలేదని 80 ఏళ్ల వృద్దునిపై దాడి చేయడంతో వృద్దునికి మోకాలు చిప్పకు తీవ్రగాయమైంది. శుక్రవారం ఉదయం వనపర్తి నుండి పెద్దమందడి పోలీస్ స్టేషన్ కు ఎస్‌ఐ విజయ్ కుమార్ తన కారులో […] The post ఎస్‌ఐ యా.. మజాకా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పోలీస్ సింహానికి కోపం
కారుకు గేదెలు అడ్డొచ్చాయని
80 ఏళ్ల వృద్ధునిపై దాడి
మోకాలుకు గాయం
ఎస్‌ఐ తీరుపై పలువురి ఆగ్రహం

 

మన తెలంగాణ/పెద్దమందడి: పెద్దమందడి పోలీస్ సింహానికి కోపం వచ్చింది. శుక్రవారం రహదారిపై తన కారుకు అ డ్డువచ్చిన గేదెలను పక్కకు కొట్టలేదని 80 ఏళ్ల వృద్దునిపై దాడి చేయడంతో వృద్దునికి మోకాలు చిప్పకు తీవ్రగాయమైంది. శుక్రవారం ఉదయం వనపర్తి నుండి పెద్దమందడి పోలీస్ స్టేషన్ కు ఎస్‌ఐ విజయ్ కుమార్ తన కారులో వస్తుండగా మనిగిళ్ల గ్రామానికి చెందిన 80 సంవత్సరాల మాధవరెడ్డి గేదెలను మే పేందుకు రోడ్డు వెంబడి తీసుకెళ్తుండగా కారుకు గేదెలు అడ్డువచ్చాయి. కొద్దిసేపు గేదెలు పక్కకు జరగక పోవడంతో తీవ్ర ఆ గ్రహంతో ఊగిపోతూ ఎస్‌ఐ కారు దిగి గేదెల వెంబడి వెళ్తున్న మాధవ రెడ్డిని అమ్మనా భూతులు తిడుతూ ముందుకు తోసివేయడంతో బిటి రోడ్డుపై పడి మోకాలుకు తీవ్రగా యమైంది. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చే యించారు. అసలు విషయం మరొక చెవిలో వినికిడి లోపం ఉ న్న మాధవరెడ్డికి ఎస్‌ఐ దాడి చేసి గాయపర్చడంపై మనిగిల్ల గ్రామస్తులు ఎస్‌ఐ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

The post ఎస్‌ఐ యా.. మజాకా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: