ఉల్లి రసంతో పగుళ్లు మాయం

  సీజన్ మారే ప్రతిసారీ పాదాల చర్మం పొడిబారి పగుళ్లు రావడం సహజమే. వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, కాలుష్యం ప్రభావం లాంటివి పాదాల మీద ఎక్కువగా చూపిస్తాయి. కాబట్టి, సీజనల్‌గా జరిగే మార్పుల సమయంలో కూడా పాదాలను కోమలంగా ఉంచుకోవాలంటేa… ఇలా చేయండి. 1. పాదాలకు కొబ్బరినూనెతో మర్దనా చేసిన తరువాత, గోరువెచ్చని నీటిలో పది నిమిషాలపాటు ఉంచాలి. తరువాత పాదాలను నీళ్లలో నుండి తీసివేసి, శుభ్రమైన పొడి బట్టతో బాగా తుడిచి గోరింట, మందార […] The post ఉల్లి రసంతో పగుళ్లు మాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సీజన్ మారే ప్రతిసారీ పాదాల చర్మం పొడిబారి పగుళ్లు రావడం సహజమే. వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, కాలుష్యం ప్రభావం లాంటివి పాదాల మీద ఎక్కువగా చూపిస్తాయి. కాబట్టి, సీజనల్‌గా జరిగే మార్పుల సమయంలో కూడా పాదాలను కోమలంగా ఉంచుకోవాలంటేa… ఇలా చేయండి.

1. పాదాలకు కొబ్బరినూనెతో మర్దనా చేసిన తరువాత, గోరువెచ్చని నీటిలో పది నిమిషాలపాటు ఉంచాలి. తరువాత పాదాలను నీళ్లలో నుండి తీసివేసి, శుభ్రమైన పొడి బట్టతో బాగా తుడిచి గోరింట, మందార పువ్వుల రసం, నిమ్మరరాలను సమపాళ్లలో తీసుకుని కలిపి పాదాలకు పట్టించాలి. ఆరిన తరువాత తుడిచేయాలి.

2. రాత్రిపూట పడుకోబోయే ముందు పాదాలను శుభ్రంగా కడిగి, ఆరిన తరువాత మసాజ్ క్రీమ్ లేదా నూనెతో ఐదు నిమిషాలపాటు మర్దనా చేస్తే పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగి, పాదాలు మృదువుగా ఉంటాయి.

3. పాదాలు, మోచేతుల వద్ద చర్మం గట్టిపడి, గరుకుగా మారినప్పుడు ఆరు టీస్పూన్ల పెట్రోలియం జెల్లీ, రెండు టీస్పూన్ల గ్లిజరిన్, రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి మర్దనా చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే పాదాలు, మోచేతులు మృదువుగా మారుతాయి.

4. వేళ్ళ మధ్యలో ఉన్న పగుళ్లలో గోరింట ఆకుల పేస్ట్ లేదా హెన్నా పొడిని నీటిలో కలుపుకుని పేస్టులా చేసుకుని పాదాలకు, వేళ్ల పగుళ్లలోనూ అప్లై చేయాలి. పూర్తిగా పొడిగా మారేంత వరకు ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసి, టవల్‌తో తుడుచుకుంటే బాగుంటుంది.

5. యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటివైరల్ లక్షణాల పరంగా పసుపు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాళ్లకు పసుపు పూసుకోవడం మంచిది. పాదమంతటికీ రాసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం వేళ్లమధ్యలో రాసుకున్నా మంచిదే.

6. పసుపు రాసుకోవడం కుదరని వారు ఉల్లిపాయ రసం తీసుకుని కాలి వేళ్ళ మధ్య మసాజ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువగా షూస్ ధరించే వాళ్ళకు ఉల్లిపాయ రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది..

7. పుదీనా ఒక సహజ సిద్దమైన డియోడరెంట్‌లా ఉపయోగపడుతుంది. మంచి క్రిమినాశక తత్వాలు కూడా పుదీనాకు ఉన్నాయి. పుదీనా రసాన్ని పాదాలకు, కాలి వేళ్లకు పూసుకుని ఆరిన తర్వాత సాక్స్ ధరించడం వల్ల పాదాలు పదిలంగా ఉంటాయి.

Fix Cracked Heels with onion juice

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉల్లి రసంతో పగుళ్లు మాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: