సుపరిపాలన అందిస్తున్నాం : కెసిఆర్

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. గొల్కొండలో జరిగిన 73వ పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా కెసిఆర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు సుపరిపాలన అందించే క్రమంలో పలు చర్యలు తీసుకున్నామని ౠయన చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసిందని ౠయన పేర్కొన్నారు. కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టం రాబోతేందని […] The post సుపరిపాలన అందిస్తున్నాం : కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. గొల్కొండలో జరిగిన 73వ పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా కెసిఆర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు సుపరిపాలన అందించే క్రమంలో పలు చర్యలు తీసుకున్నామని ౠయన చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసిందని ౠయన పేర్కొన్నారు. కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టం రాబోతేందని చెప్పారు. 60 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపు రేఖలను మార్చబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రజా ప్రతినిధులు గ్రామల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. పంచాయతీ, మున్సిపల్ నిధుల్లో 10 శాతం పచ్చదనానికి కేటాయిస్తామన్నారు. పర్యావరణ పరిక్షణకు ప్రతి ఒక్కరు కంకణబద్దులై ముందకు సాగి భావి తరాలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల కష్టాలు తీరబోతున్నాయని ఆయన చెప్పారు. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా రైతులకు ఓ వరమని ఆయన పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మిషన్ భగీరథతో తాగునీటి సమస్యను తీర్చినట్టు ఆయన వెల్లడించారు. సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన చెప్పారు. రైతు బంధు, రైతు బీమాను ఐక్యరాజ్యసమితి గుర్తించి , ప్రశసించిందని ఆయన చెప్పారు.

సమైక్య ఆలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని ఆయన పేర్కొన్నారు. ప్రగతి ప్రస్థానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. పాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఐదేళ్లలో తెలంగాణ ఎంతగానో ప్రగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రణాళికబద్దమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్టు ఆయన తెలిపారు. ఆర్థికంగా తెలంగాణ బలమైన శక్తిగా ఎదిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాలు పరఢవిల్లుతున్నాయన్నారు.

CM KCR Participated In August 15th Celebrations

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సుపరిపాలన అందిస్తున్నాం : కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: