భారత ఆర్మీకి ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ నివాళీ..

  హైదరాబాద్‌: సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్. 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సేవ చేస్తూ త్యాగానికి మారుపేరైన భారత సైనికులకు ఘన నివాళిగా ఓ పాటతో కూడిన వీడియోను అభిమానులతో పంచుకుంది. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ టైటిల్ సాంగ్  ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో 1971 ఇండో-పాక్‌ వార్‌, సియాచిన్‌ వివాదం, కార్గిల్‌ యుద్ధం, 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌ చిత్రాలను […] The post భారత ఆర్మీకి ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ నివాళీ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్. 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సేవ చేస్తూ త్యాగానికి మారుపేరైన భారత సైనికులకు ఘన నివాళిగా ఓ పాటతో కూడిన వీడియోను అభిమానులతో పంచుకుంది. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ టైటిల్ సాంగ్  ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో 1971 ఇండో-పాక్‌ వార్‌, సియాచిన్‌ వివాదం, కార్గిల్‌ యుద్ధం, 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌ చిత్రాలను చూపించారు.

ఈ సినిమాలో మహేశ్‌బాబు మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ కు జోడీగా యంగ్ హీరోయిన్ రష్మిక మందాన నటిస్తుంది. ఇక, 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sarileru Neekevvaru movie title song released

The post భారత ఆర్మీకి ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ నివాళీ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: