పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టీమిండియా వన్డే సిరీస్‌ని కూడా క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం విండీస్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ గేల్(72), లూయిస్(43) అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ సునామీలా విరుచుకుపడడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అయితే ఆట మధ్యలో వర్షం రావడంతో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(10) లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(36) పర్వాలేదనిపించగా.. పంత్(0) మరోసారి నిరాశపర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ(114 నాటౌట్) శతకంతో మెరవగా, యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్(65) అర్ధశతకంతో చెలరేగడంతో భారత్ 32.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.
Team India 2-0 win ODI Series against West Indies
The post టీమిండియాదే వన్డే సిరీస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.