ఇండియ‌న్2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్

చెన్నయ్ : ప్రముఖ దర్శకుడు శంకర్ , విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు2 ఫస్ట్ లుక్ గురువారం ఉదయం విడుదలైంది. 20 ఏళ్ల క్రితం వీరి కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు రికార్డులు తిరగరాసింది. ఈ సినమాకు సీక్వేల్ గా భారతీయుడు2 వస్తోంది. రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తమిళం, తెలుగు, హిందీతో […] The post ఇండియ‌న్2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : ప్రముఖ దర్శకుడు శంకర్ , విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు2 ఫస్ట్ లుక్ గురువారం ఉదయం విడుదలైంది. 20 ఏళ్ల క్రితం వీరి కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు రికార్డులు తిరగరాసింది. ఈ సినమాకు సీక్వేల్ గా భారతీయుడు2 వస్తోంది. రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తమిళం, తెలుగు, హిందీతో పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో తీయనున్నారు. భారతీయుడు2లో కమల్ హాసన్ కు జోడీగా ప్రముఖ హీరోయిన్ కాజల్ నటిస్తుండగా, దుల్కర్ సల్మాన్ కీలకపాత్రలో, నెగటివ్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. వెన్నెల కిశోర్ సైతం ప్రముఖ పాత్రలో నటించనున్నారు. పంద్రాగస్టును పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. భారతీయుడులో పోషించిన సిబిఐ అధికారి పాత్రలోనే ఈ సినిమాలో కూడా నెడుమూడి వేణు నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.

Indian 2 First Look Release

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇండియ‌న్2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: