ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం: ప్రధాని మోడీ

  న్యూఢిల్లీ: ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వతంత్య్రం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవ పురస్కరించుకొని ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘స్వాతంత్ర్యం అనంతరం శాంతి, సమృద్ధి, భద్రతకు అందరూ కృషి చేశారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు.  ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తమకు అవకాశం ఇచ్చారు. వారు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తాం. ప్రజల […] The post ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం: ప్రధాని మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వతంత్య్రం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవ పురస్కరించుకొని ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘స్వాతంత్ర్యం అనంతరం శాంతి, సమృద్ధి, భద్రతకు అందరూ కృషి చేశారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు.  ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తమకు అవకాశం ఇచ్చారు. వారు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తాం. ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం. ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

 

అందులో భాగంగానే ఆర్టికల్‌ 370,35ఏ రద్దు చేశాం. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కలలను నెరవేర్చాం. జమ్మూ కశ్మీర్, లడక్‌లో శాంతి స్థాపనే మా లక్ష్యం. అన్ని పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించాయి. 70 ఏళ్లలో చేయలేకపోయిన పనిని 70 రోజుల్లో చేసి చూపించాం. ఒకే జాతి- ఒకే రాజ్యంగం ఉండాలని దేశ ప్రజలతో పాటు కశ్మీరీ ప్రజలు కూడా అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ ఏర్పడిన 10 వారాల్లోనే ప్రజలకు మేలుచేసే కీలక నిర్ణయాలు తీసుకున్నాం. తలాక్ చట్టం ద్వారా ముస్లీం మహిళలకు సాధికారత కల్పించాం. రాజ్యంగ స్పూర్తితో ముస్లీం మహిళలకు సమాన హక్కులు కల్పించాం. వచ్చే ఐదేళ్లకు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వేగవంతంగా ప్రగతిపథంలో ముందుకెళ్తున్నాం’ అని ప్రధాని మోడీ అన్నారు.

PM Modi Address to Nation on 73rd Independence day

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం: ప్రధాని మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: