వాణిజ్య లోటు దిగొచ్చింది..

  2.25 శాతం పెరిగిన ఎగుమతులు జులై నెలలో 26.33 బిలియన్ డాలర్లు నమోదు 10.43 శాతం తగ్గిన దిగుమతులు న్యూఢిల్లీ : జూలైలో దేశీయ ఎగుమతులు 2.25 శాతం పెరిగి 26.33 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు నాలుగు నెలల కనిష్టానికి తగ్గుముఖం పట్టింది. గతేడాదిలో ఎగుమతులు 25.75 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈమేరకు బుధవారం ప్రభుత్వ గణాంకాలను విడుదల చేసింది. ఇదే కాలంలో దిగుమతులు 10.43 శాతం తగ్గి 39.76 బిలియన్ […] The post వాణిజ్య లోటు దిగొచ్చింది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

2.25 శాతం పెరిగిన ఎగుమతులు
జులై నెలలో 26.33 బిలియన్ డాలర్లు నమోదు
10.43 శాతం తగ్గిన దిగుమతులు

న్యూఢిల్లీ : జూలైలో దేశీయ ఎగుమతులు 2.25 శాతం పెరిగి 26.33 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు నాలుగు నెలల కనిష్టానికి తగ్గుముఖం పట్టింది. గతేడాదిలో ఎగుమతులు 25.75 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈమేరకు బుధవారం ప్రభుత్వ గణాంకాలను విడుదల చేసింది. ఇదే కాలంలో దిగుమతులు 10.43 శాతం తగ్గి 39.76 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ కారణంగా జూలైలో వాణిజ్య లోటు 13.43 బిలియన్ డాలర్లకు తగ్గింది. దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసమే వాణిజ్య లోటు. గత ఏడాది జూలైలో వాణిజ్య లోటు 18.63 బిలియన్ డాలర్లుగా ఉంది.

రసాయన, స్టీలు, ఔషషధ రంగాలు జూలై నెలలో సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. జేమ్స్, జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, పెట్రోలియం ఉత్పత్తులలో ప్రతికూల వృద్ధి ఉంది. జూలై 2019లో చమురు దిగుమతులు 22.15 శాతం తగ్గి 9.6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, చమురుయేతర దిగుమతులు 5.92% తగ్గి 30.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మొత్తం ఎగుమతులు 2019 ఏప్రిల్-జూలైలో 0.37% తగ్గి 107.41 బిలియన్ డాలర్లకు చేరుకో గా, దిగుమతులు 3.63% తగ్గి 166.8 బిలియన్ డాలర్ల కు చేరుకున్నాయి. 2019 జూలైలో బంగారు దిగుమతు లు 42.2% తగ్గి 1.71 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

1.08 శాతానికి తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోంది. ఇంధనం, విద్యుత్ ధరలు చౌక కావడం వల్ల జూలై నెలలో ఇది 24 నెలల కనిష్ట స్థాయికి చేరింది. టోకు ధరల సూచిక ఆధారిత (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం జూలై నెలలో 1.08 శాతానికి పడిపోయింది. టోకు ద్రవ్యోల్బణం వరుసగా మూడవ నెలలో క్షీణించింది. జూన్‌లో ఇది 2.02 శాతం గా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 5.04 శాతం నుండి 4.54 శాతానికి పడిపోయింది. పప్పుధాన్యాలు, చక్కెర ధరలపై సామాన్యులకు ఉపశమనం లభించింది. గత నెలలో పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం 23.06 శాతం నుంచి 20.08 శాతానికి, చక్కెర ద్రవ్యోల్బణ రేటు 4.01 శాతం నుంచి -0.94 శాతానికి పడిపోయింది.

17 ఏళ్ల కనిష్టానికి చైనా పారిశ్రామిక ఉత్పత్తి

జులైలో చైనా పారిశ్రామిక ఉత్పత్తి 17 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 2002 ఫిబ్రవరి నాటి దిగువ స్థాయికి ఈ సూచీ క్షీణించింది. అమెరికాచైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో రిటైల్ రంగం కూడా క్షీణించింది. జూలైలో చైనా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 4.80 శాతం నమోదవగా, ఇది 2002 తరువాత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. జూన్‌లో ఈ రేటు 6.30 శాతంగా ఉంది. బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలలో ఈ విషయం వెల్లడైంది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, జూలైలో చైనా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఆరు శాతంగా ఉంటుందని అంచనా.

అయితే రిటైల్ అమ్మకాలు జూన్‌లో 9.80 శాతంతో పోల్చితే, జూలైలో 7.60 శాతానికి చేరుకుంది. దీని ఆధారంగా చైనాలో వినియోగదారుల డిమాండ్ తగ్గుతోందని గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ కాలంలో దీర్ఘకాలిక పెట్టుబడుల వృద్ధి రేటు కూడా 5.70 శాతానికి పడిపోయింది. రెండో త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 6.20 శాతం వృద్ధి నమోదు చేసింది. దాదాపు మూడు దశాబ్దాల్లో ఇది అతి తక్కువ రేటు కావడం గమనార్హం.

Exports growth inches up 2.25 per cent in July

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాణిజ్య లోటు దిగొచ్చింది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: