ఇంగ్లండ్ క్రికెటర్ సారా టేలర్ సంచలనం

లండన్: ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్ సారా టేలర్ నగ్న చిత్రంతో పెను సంచలనం సృష్టించింది. దుస్తులు లేకుండా తన నగ్న చిత్రాన్ని సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనంగా మారింది. పూర్తి నగ్నంగా వికెట్ కీపింగ్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పెట్టింది. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎవరూ చేయని సాహసాన్ని సారా చేసింది. ఆమె చేసిన సాహసంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. […] The post ఇంగ్లండ్ క్రికెటర్ సారా టేలర్ సంచలనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్ సారా టేలర్ నగ్న చిత్రంతో పెను సంచలనం సృష్టించింది. దుస్తులు లేకుండా తన నగ్న చిత్రాన్ని సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనంగా మారింది. పూర్తి నగ్నంగా వికెట్ కీపింగ్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పెట్టింది. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎవరూ చేయని సాహసాన్ని సారా చేసింది. ఆమె చేసిన సాహసంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల క్రికెట్‌లో సారా అత్యుత్తమ క్రికెటర్‌గా పేరు తెచ్చుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌విమెన్‌గా సారా కొనసాగుతోంది. ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించడంలో సారాదే కీలకపాత్ర. భారత్‌తో జరిగిన మహిళల ప్రపంచకప్‌లో సారా ఆడిన అద్భుత ఇన్నింగ్స్ వల్లే భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఇదిలావుండగా 30 ఏళ్ల సారా చాలా కాలంగా మానసిక సమస్యతో బాధపడుతోంది. దీనికి వ్యక్తిగ సమస్యలు తోడు కావడంతో ఎక్కువగా క్రికెట్ ఆడలేక పోతోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల యాషెస్ టెస్టులో కూడా బరిలోకి దిగలేదు. కాగా, మహిళల దేహానికి సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఇటీవల ఉమెన్స్‌హెల్త్ యూకే సారాను ఆహ్వానించింది. ఆ సంస్థ విజ్ఞప్తి మేరకు సారా ఇలా తన నగ్న చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో తనను భాగస్వామిగా ఎంచుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు చెప్పింది. బయట చూస్తే ప్రతి అమ్మాయి బాగానే ఉంటుందని, అయితే ఆమె ఎన్నో శారీరక సమస్యలు ఎదుర్కొంటుందన్న విషయం అందరికి తెలియదని చెప్పింది. ఇక, నగ్న చిత్రాన్ని పోస్ట్ చేయడంపై అభిమానులు తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరింది. ఓ మంచి పని కోసం ఈ సాహసం చేశానని సారా స్పష్టం చేసింది.

Cricketer Sarah Taylor Shares her Nude Picture

The post ఇంగ్లండ్ క్రికెటర్ సారా టేలర్ సంచలనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: