చెల్లెళ్లకు రక్షాబంధన్ అన్నయ్యలకు దీక్షాబంధన్

  అమ్మలా లాలిస్తూ, నాన్నలా దండిస్తూ అన్ని సమయాల్లో దిశానిర్దేశం చేస్తూ చేయి పట్టుకుని ముందుకు నడిపేది అన్నయ్య. కష్టసుఖాల్లో నీడలా తోడుండే మిత్రుడు.. నేనున్నానంటూ ఇచ్చే భరోసా… విజయం సాధించినప్పుడు మనసారా చిందించే చిరునవ్వు.. ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు భుజం తట్టి అందించే ధైర్యం. మనసు మెచ్చిన ఒక తోబుట్టువు ద్వారా మాత్రమే సాధ్యం. ఆటపాటల్లో, నడతలో, నడకలో ఒక్కటిగా జీవిస్తూ… మనలో మంచిని, చెడుని గమనిస్తూ… అవసరమైనప్పుడు మందలిస్తూ మెలగడం మనసెరిగిన సోదరునికి మాత్రమే సాధ్యం. […] The post చెల్లెళ్లకు రక్షాబంధన్ అన్నయ్యలకు దీక్షాబంధన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమ్మలా లాలిస్తూ, నాన్నలా దండిస్తూ అన్ని సమయాల్లో దిశానిర్దేశం చేస్తూ చేయి పట్టుకుని ముందుకు నడిపేది అన్నయ్య. కష్టసుఖాల్లో నీడలా తోడుండే మిత్రుడు.. నేనున్నానంటూ ఇచ్చే భరోసా… విజయం సాధించినప్పుడు మనసారా చిందించే చిరునవ్వు.. ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు భుజం తట్టి అందించే ధైర్యం. మనసు మెచ్చిన ఒక తోబుట్టువు ద్వారా మాత్రమే సాధ్యం. ఆటపాటల్లో, నడతలో, నడకలో ఒక్కటిగా జీవిస్తూ… మనలో మంచిని, చెడుని గమనిస్తూ… అవసరమైనప్పుడు మందలిస్తూ మెలగడం మనసెరిగిన సోదరునికి మాత్రమే సాధ్యం.

అన్నయ్య రక్ష: ప్రస్తుతం ఆడపిల్ల తనను తాను రక్షించుకొనే స్థాయికి ఎదిగినప్పటికీ, అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, ఎదురుగా దుర్మార్గులు గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు అన్నయ్య అనే పిలుపుతో ఎంతో ధైర్యం వస్తుంది.
ప్రస్తుతం ఆడపిల్లలపై అత్యాచారాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. అక్క చెల్లెళ్లకు రక్షాబంధన్ అయితే అన్నదమ్ములకు దీక్షాబంధన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి అన్నయ్య ఇంకో అమ్మాయిని చూసినప్పుడు చెల్లెల్ని గుర్తు చేసుకునేలా దీక్ష పూనినట్లైతే భవిష్యత్‌లో ఆడపిల్లలపై అకృత్యాలకు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు.

మానవీయ సంబంధాలను పెంచేది: మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ.. సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే రాఖీ పండగ సంప్రదాయబద్ధమైన మన విలువలను మరింత ఉట్టిపడేలా చేస్తుంది. ఉన్మాదత్వం వంటి వెకిలి చేష్టలు పేట్రేగి, మనవతా విలువులు మంటగలుస్తున్న ప్రస్తుత ఆధునిక యుగంలో ’రాఖీ పౌర్ణమి‘ తన విశిష్టతను చాటిచెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది.

                                                                                      – డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి, సైకాలజిస్ట్

special story about raksha bandhan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చెల్లెళ్లకు రక్షాబంధన్ అన్నయ్యలకు దీక్షాబంధన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: