స్థానికేతరులను తరిమేస్తున్న కశ్మీరీలు

శ్రీనగర్: జమ్మూ కశ్మీరు ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో స్థానికేతరుల గూడు చెదిరింది. ఇప్పటి వరకు తమను సొంత మనుషులుగా చూసుకున్న కశ్మీరీలే తమ రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలంటూ వారికి తరిమివేస్తున్నారు. ఇప్పటి వరకు అద్దెకు ఉంటున్న స్థానికేతరులు ఎక్కడ తమ ఆస్తులను కబ్జా చేసుకుంటారోనని కశ్మీరీ భయపడడమే ఈ పరిస్థితికి కారణం. కశ్మీరీల తాజా నిర్ణయంతో వేలాది మంది స్కిల్డ్, సెమీ స్కిల్డ్ స్థానికేతర కార్మికులు తమ […] The post స్థానికేతరులను తరిమేస్తున్న కశ్మీరీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

శ్రీనగర్: జమ్మూ కశ్మీరు ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో స్థానికేతరుల గూడు చెదిరింది. ఇప్పటి వరకు తమను సొంత మనుషులుగా చూసుకున్న కశ్మీరీలే తమ రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలంటూ వారికి తరిమివేస్తున్నారు. ఇప్పటి వరకు అద్దెకు ఉంటున్న స్థానికేతరులు ఎక్కడ తమ ఆస్తులను కబ్జా చేసుకుంటారోనని కశ్మీరీ భయపడడమే ఈ పరిస్థితికి కారణం. కశ్మీరీల తాజా నిర్ణయంతో వేలాది మంది స్కిల్డ్, సెమీ స్కిల్డ్ స్థానికేతర కార్మికులు తమ స్వస్థలాలలకు వెళ్లిపోవలసిన అగత్యం ఏర్పడింది. పంజాబ్, బీహార్, యుపి, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది కార్మికులు కశ్మీరుకు ప్రతి ఏటా వచ్చి వ్యవసాయం, భవన నిర్మాణ రంగాలలో పనిచేస్తుంటారు.

వీరిలో చాలామంది చలికాలంలో తమ స్వస్థలాలకు వెళ్లిపోయి తిరిగి వేసవి రాగానే వస్తుంటారు. కశ్మీరు వ్యాప్తంగా స్థానికేతరులే సెలూన్ షాపులు పెట్టుకుని క్షురక వృత్తిని చేస్తుంటారు. వీరిలో అత్యధికరులు యుపిలోని బిజ్నూర్‌కు చెందినవారు. స్థానికేతర కార్మికులు వెళ్లిపోతుండడంతో భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్ర స్థాయిలో ఉన్న 90వ దశకంలో కూడా ఈ రకమైన వేధింపులను స్థానికుల నుంచి స్థానికేతరులు ఎదుర్కోలేదని కొందరు చెబుతున్నారు.

Worried locals ask non Kashmiris to vacate valley, after the Centre revoked Article 370 the people of J&K asked thousands of skilled and semi skilled non local labourers to vacate their premises

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్థానికేతరులను తరిమేస్తున్న కశ్మీరీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: