జెఎల్ఎల్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీని ప్రారంభించిన కెటిఆర్

  హైదరాబాద్ : రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో జెఎల్ఎల్ రియల్ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కొత్త కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కు వచ్చే కంపెనీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఐటీ ఎగుమతుల్లో బెంగుళూరును హైదరాబాద్ అధిగమిస్తోంది. హైదరాబాద్ లో ఐదేళ్ల క్రితం 52 వేల కోట్లున్న ఐటీ ఎగుమతులు, ఈ ఏడాది లక్షా 9 వేల […] The post జెఎల్ఎల్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీని ప్రారంభించిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో జెఎల్ఎల్ రియల్ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కొత్త కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కు వచ్చే కంపెనీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఐటీ ఎగుమతుల్లో బెంగుళూరును హైదరాబాద్ అధిగమిస్తోంది. హైదరాబాద్ లో ఐదేళ్ల క్రితం 52 వేల కోట్లున్న ఐటీ ఎగుమతులు, ఈ ఏడాది లక్షా 9 వేల కోట్లకు పెరిగాయన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి హైదరాబాద్ హబ్ గా మారిందని పేర్కొన్నారు.

గూగుల్ అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ లో బ్రాంచీలు ఏర్పాటు చేశాయి. కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. గత ఐదేళ్లుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది. హైదరాబాద్ అభివృద్దిలో జేఎల్ఎల్ గ్రూప్ పాత్ర గొప్పదన్నారు. మెట్రో రైలు ఎయిర్ పోర్ట ఎక్స్ ప్రెస్ పనులు త్వరలో ప్రారంభమవుతాయి. పబ్లిక్ ట్రాన్సపోర్ట్, కార్ పూలింగ్ ను ఉపయోగించుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ కంపెనీల విస్తరణకు లుక్ ఈస్ట్ పాలసీ తెచ్చాం హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో గత పదేళ్లుగా ఐటీ కంపెనీలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.

 

KTR launched of JLL Real Estate Consulting Company

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జెఎల్ఎల్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీని ప్రారంభించిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: