డ్రైవరన్నా…నీ నిజాయితీకి సలాం అన్న

  హైదరాబాద్ : తన ఆటోలో ఓ వ్యక్తి ఆదమరిచి పోగొట్టుకున్న ల్యాప్‌టాప్‌, నగదు వస్తువులను పోలీస్ స్టేషన్ లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. వివరాల్లోకి వెల్తే.. మంగళవారం రాత్రి పివిఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబర్‌ 258 వద్ద ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆటోను కిరాయికి తీసుకున్నాడు. అయితే ఆ ఇంజినీర్‌ బెంగుళూరు వెళ్లాల్సి ఉండగా, బెంగుళూరుకు వెళ్లే బస్సును క్యాచ్‌ చేయాలని ఆటో డ్రైవర్‌కు సూచించాడు. ఈ క్రమంలో బస్సు […] The post డ్రైవరన్నా… నీ నిజాయితీకి సలాం అన్న appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : తన ఆటోలో ఓ వ్యక్తి ఆదమరిచి పోగొట్టుకున్న ల్యాప్‌టాప్‌, నగదు వస్తువులను పోలీస్ స్టేషన్ లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. వివరాల్లోకి వెల్తే.. మంగళవారం రాత్రి పివిఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబర్‌ 258 వద్ద ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆటోను కిరాయికి తీసుకున్నాడు. అయితే ఆ ఇంజినీర్‌ బెంగుళూరు వెళ్లాల్సి ఉండగా, బెంగుళూరుకు వెళ్లే బస్సును క్యాచ్‌ చేయాలని ఆటో డ్రైవర్‌కు సూచించాడు. ఈ క్రమంలో బస్సు వద్దకు వెళ్లగానే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బస్ మిస్ అవుతదేమోనన్న కంగారులో.. ఆటోలో ఉన్న ల్యాప్‌టాప్‌, నగదును మరిచిపోయాడు.

తాను ల్యాప్‌టాప్‌, నగదు మరిచిపోయానని తెలుసుకున్న సదరు ఇంజినీర్‌ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక తన ఆటోలో ల్యాప్‌టాప్‌ బ్యాగును గమనించిన ఆటో డ్రైవర్‌ రాజ్‌ కుమార్‌(32) ఇవాళ ఉదయం నేరుగా రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆ బ్యాగును అప్పజెప్పాడు. ల్యాప్‌టాప్‌, నగదును సదరు ఇంజినీర్‌కు పోలీసులు అప్పగించారు. మొత్తానికి ఆటో డ్రైవర్‌ నిజాయితీని పోలీసులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మెచ్చుకుని అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు.

 

Auto Driver returned items he had found and was honest

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డ్రైవరన్నా… నీ నిజాయితీకి సలాం అన్న appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: