షరతుల్లేవ్.. కశ్మీరుకు ఎప్పుడు రమ్మంటారు?

న్యూఢిల్లీ: కశ్మీరు లోయలో పరిస్థితిని పరిశీలించడానికి కావాలంటే విమానం పంపిస్తానంటూ కశ్మీరు గవర్నర్ సత్యపాల్ మాలిక్ పంపిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించడంతో పాటు తనతోపాటు ప్రతిపక్ష నాయకులను అనుమతించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాను విధించిన షరతులను ఉపసంహరించుకుంటున్నట్లు మరో ట్వీట్ ద్వారా బుధవారం గవర్నర్ మాలిక్‌కు తెలియచేశారు. మంగళవారం గవర్నర్ మాలిక్ ఆహ్వానాన్ని రాహుల్ మన్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి నివేదించిన గవర్నర్ మాలిక్ సాయంత్రానికి […] The post షరతుల్లేవ్.. కశ్మీరుకు ఎప్పుడు రమ్మంటారు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కశ్మీరు లోయలో పరిస్థితిని పరిశీలించడానికి కావాలంటే విమానం పంపిస్తానంటూ కశ్మీరు గవర్నర్ సత్యపాల్ మాలిక్ పంపిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించడంతో పాటు తనతోపాటు ప్రతిపక్ష నాయకులను అనుమతించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాను విధించిన షరతులను ఉపసంహరించుకుంటున్నట్లు మరో ట్వీట్ ద్వారా బుధవారం గవర్నర్ మాలిక్‌కు తెలియచేశారు. మంగళవారం గవర్నర్ మాలిక్ ఆహ్వానాన్ని రాహుల్ మన్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి నివేదించిన గవర్నర్ మాలిక్ సాయంత్రానికి రాహుల్ ప్రతిపాదనపై కొత్త మెలిక పెట్టారు.

రాహుల్ గాంధీ అనేక ముందస్తు షరతులు పెట్టినందున ఆయన కశ్మీరు పర్యటనకు అనుమతించబోమంటూ రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై రాహుల్ బుధవారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. డియర్ మాలిక్‌జీ, నా ట్వీట్‌కు మీ బలహీనమైన సమాధానం చూశాను. జమ్మూ కశ్మీరును సందర్శంచి, అక్కడి ప్రజలను కలుసుకోవాలని మీరు పంపిన ఆహ్వానాన్ని ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా అంగీకరిస్తున్నాను. ఎప్పుడు రమ్మంటారు? అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై గవర్నర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

rahul gandhis tweet reply to jammu kashmir Guv has a request and more, Rahul accepts Satyapal Maliks offer to visit Kashmir without conditions

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post షరతుల్లేవ్.. కశ్మీరుకు ఎప్పుడు రమ్మంటారు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: