రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జర్నలిస్టు భార్యకు ప్రభుత్వోద్యోగం

  తిరువనంతపురం: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు చనిపోవడంతో అతడి భార్యకు కేరళ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది. ఐఎఎస్ ఆఫీసర్ కారును డ్రైవ్ చేస్తు వెళ్లి జర్నలిస్టును ఢీకొట్టడంతో అతడు ఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు. దీంతో కేరళ ప్రభుత్వం జర్నలిస్టు భార్యకు ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3న సిరాజ్ న్యూస్ పేపర్ లో బ్యూరో చీఫ్ గా పని చేస్తున్న కెఎం బషీర్ తన ద్విచక్రవాహనంపై తిరువనంతపురంలోని మ్యూజియమ్ రోడ్డులో  […] The post రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జర్నలిస్టు భార్యకు ప్రభుత్వోద్యోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తిరువనంతపురం: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు చనిపోవడంతో అతడి భార్యకు కేరళ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది. ఐఎఎస్ ఆఫీసర్ కారును డ్రైవ్ చేస్తు వెళ్లి జర్నలిస్టును ఢీకొట్టడంతో అతడు ఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు. దీంతో కేరళ ప్రభుత్వం జర్నలిస్టు భార్యకు ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3న సిరాజ్ న్యూస్ పేపర్ లో బ్యూరో చీఫ్ గా పని చేస్తున్న కెఎం బషీర్ తన ద్విచక్రవాహనంపై తిరువనంతపురంలోని మ్యూజియమ్ రోడ్డులో  వెళ్తున్నాడు. ఐఎఎస్ అధికారి శ్రీరామ్ వెంకితరమణ్  తన కారు నడుపుకుంటూ వచ్చి బషీర్ బైక్ ను ఢీకొట్టాడు. దీంతో జర్నలిస్టు రోడ్డు డివైడర్ పై పడిపోయాడు. వెంటనే స్థానికులు సదరు జర్నలిస్టును ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో 24 గంటలు చికిత్స పొందిన అనంతరం అతడు కన్నుమూశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్రీరామ్ ను అరెన్టు చేశారు. బషీర్ చనిపోవడంలో అతడి భార్య జషీలా , ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. దీంతో జర్నలిస్టు సంఘాలు బషీర్ కుటుంబాన్ని అదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. దీంతో బషీర్ భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని, మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంది. అనంతరం జషీలాకు మలయాళం యూనివర్సిటీలో ఉద్యోగం ఇస్తామని, ఆమె విద్యార్హతను బట్టి ఉద్యోగం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం కూడా బషీర్ కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. శ్రీరామ్ కేరళ హైకోర్టులో వేసిన బెయిల్ ను కోర్టు తిరస్కరించింది.  గతంలో కూడా శ్రీరామ్ రోడ్డు ప్రమాదం చేసి సస్పెండ్ అయ్యాడు. శ్రీరామ్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మత్తు పదార్థం తీసుకున్నాడని వైద్య పరీక్షలో తేలింది. ప్రమాదం జరిగినప్పుడు శ్రీరామ్ స్నేహితుడు వాఫ్ ఫిరోజ్ ఘటనా స్థలంలోనే ఉన్నాడు.  ప్రమాదం జరగ్గానే శ్రీరామ్  ను కిమ్స్ ఆస్పత్రికి తరలించి రక్త పరీక్షలు నిర్వహించారు. 

 

Kerala Govt offer Job to Journalist wife 
Kerala Govt offer Job to Journalist wife 

 

 

 

 

 

The post రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జర్నలిస్టు భార్యకు ప్రభుత్వోద్యోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.