మోడీ, అమిత్ షాకు ర్యాపర్ సవాలు (వైరల్ వీడియో)

చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను విమర్శిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసిన ర్యాపర్ సింగర్ హర్ద్ కౌర్ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమానికి చెందిన ముగ్గురు సహచరులతో కలసి హర్ద్ కౌర్ పాల్గొన్న ఈ 2.20 నిమిషాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 15 దేశాలలో తమ వేర్పాటువాద పతాకాన్ని ఎగరవేస్తామని, ప్రధానికి, హోం మంత్రికి ధైర్యముంటే దీన్ని అడ్డుకోవాలంటూ ఆమె ఈ […] The post మోడీ, అమిత్ షాకు ర్యాపర్ సవాలు (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను విమర్శిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసిన ర్యాపర్ సింగర్ హర్ద్ కౌర్ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమానికి చెందిన ముగ్గురు సహచరులతో కలసి హర్ద్ కౌర్ పాల్గొన్న ఈ 2.20 నిమిషాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 15 దేశాలలో తమ వేర్పాటువాద పతాకాన్ని ఎగరవేస్తామని, ప్రధానికి, హోం మంత్రికి ధైర్యముంటే దీన్ని అడ్డుకోవాలంటూ ఆమె ఈ వీడియోలో సవాలు చేసింది.

ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేసిన తర్వాత త్వరలో విడుదల చేయనున్న తన మరోపాటకు సంబంధించిన ప్రమోషనల్ క్లిప్‌ను 39 ఏళ్ల హర్ద్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న హర్ద్ కౌర్ అసలు పేరు తరన్ కౌర్ ధిల్లాన్. భారతదేశంలోని మితవాద రాజకీయ పార్టీలను విమర్శిస్తూ ఆమె గతంలో కూడా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై ఈ ఏడాది జూన్‌లో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టగా ఆమెపై దేశద్రోహ ఆరోపణల కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను ఆమె పిరికిపంద చర్యగా అభివర్ణించింది. ఫ్యూచర్ రికార్డ్ ఆఫ్ ఇండియా అనే మ్యూజిక్ లేబుల్‌తో ఆమె వీడియోలను రికార్డు చేస్తోంది.

Hard Kaur shares video slamming Modi and Amit Shah

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మోడీ, అమిత్ షాకు ర్యాపర్ సవాలు (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: