ప్రాణం తీసిన గల్లీ క్రికెట్…

అమరావతి: క్రికెట్ ఆటలో ఇద్దరు మైనర్ల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. విశాఖపట్నం లోని కరాస ప్రాతంలో విజయ్(13), అతని స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో క్రికెట్ ఆడుతుండగా మరో బాలుడితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే విజయ్‌ను సదరు బాలుడు క్రికెట్ బ్యాటుతో పొట్టపై బలంగా కొట్టాడు. దీంతో విజయ్‌కు తీవ్ర స్థాయిలో కడుపునొప్పి రావడంతో వెంటనే సమీప దవాఖానకు తరలించారు. విజయ్ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు […] The post ప్రాణం తీసిన గల్లీ క్రికెట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
అమరావతి: క్రికెట్ ఆటలో ఇద్దరు మైనర్ల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. విశాఖపట్నం లోని కరాస ప్రాతంలో విజయ్(13), అతని స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో క్రికెట్ ఆడుతుండగా మరో బాలుడితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే విజయ్‌ను సదరు బాలుడు క్రికెట్ బ్యాటుతో పొట్టపై బలంగా కొట్టాడు. దీంతో విజయ్‌కు తీవ్ర స్థాయిలో కడుపునొప్పి రావడంతో వెంటనే సమీప దవాఖానకు తరలించారు. విజయ్ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
One killed in confrontation between two miners in AP

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రాణం తీసిన గల్లీ క్రికెట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: