నాలుగు గంటల్లోనే మోకాలి మార్పిడి ఆపరేషన్

లండన్ : బ్రిటన్ నేషనల్ హెల్తు సర్వీసెస్ (ఎన్‌హెచ్‌ఎస్) కేవలం నాలుగు గంటల్లోనే మోకా లు మార్పిడి శస్త్ర చికిత్స చేయడమే కాక, అదే రోజు రోగినడిచేలా చేసి సంచలనం సృష్టించింది. సంప్రదాయ పద్ధతిని అనుసరించినప్పటికీ శస్త్ర చికిత్స విధానంలో కొత్త పోకడ చూపించ గలిగింది. కొన్ని రోజుల పాటు రోగి ఆస్పత్రిలో ఉండవలసిన అగత్యం ఈ పద్ధతి వల్ల ఇక ఉం డదు. సర్జన్లు ఈ కొత్త పద్ధతిని ‘పయనీరింగ్’ అని పిలుస్తున్నారు. వేగంగా రోగి […] The post నాలుగు గంటల్లోనే మోకాలి మార్పిడి ఆపరేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్ : బ్రిటన్ నేషనల్ హెల్తు సర్వీసెస్ (ఎన్‌హెచ్‌ఎస్) కేవలం నాలుగు గంటల్లోనే మోకా లు మార్పిడి శస్త్ర చికిత్స చేయడమే కాక, అదే రోజు రోగినడిచేలా చేసి సంచలనం సృష్టించింది. సంప్రదాయ పద్ధతిని అనుసరించినప్పటికీ శస్త్ర చికిత్స విధానంలో కొత్త పోకడ చూపించ గలిగింది. కొన్ని రోజుల పాటు రోగి ఆస్పత్రిలో ఉండవలసిన అగత్యం ఈ పద్ధతి వల్ల ఇక ఉం డదు. సర్జన్లు ఈ కొత్త పద్ధతిని ‘పయనీరింగ్’ అని పిలుస్తున్నారు. వేగంగా రోగి కోలుకోవడంతో పడకలు వేగంగా ఖాళీ అవుతుంటాయని, ఎన్‌హెచ్‌ఎస్ (నేషనల్ హెల్తు సర్వీస్ )కు ఏటా కొన్ని మిలియన్ల పౌండ్ల వరకు ఆదా అవుతుందని చెబుతున్నారు. దాదాపు సంప్రదాయ పద్ధతి ప్రకారం ఈ ఆపరేషన్ జరిగినా రోగికి మత్తు మందు ఇవ్వకుండానే రోగి తెలివి మీద ఉంటుండగానే ఆపరేషన్ పూర్తి చేయడం విశేషం.

ఈ కొత్త టెక్నిక్ కన్సల్టెంట్ ఆర్ధోపెడిక్ సర్జన్ గ్రాహం వాల్ష్ అభివృద్ధి చేశారు. దీన్ని కాల్‌డెర్డబుల్ అండ్ హడ్డర్స్‌ఫీల్డు ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్టు వద్ద ప్రవేశ పెట్టారు. ఎన్‌హెచ్‌ఎస్‌లో ఇది పెద్ద సంచలనంగా అభివర్ణిస్తున్నారు. 2018 ఫిబ్రవరి నుంచి ఈ ఆస్పత్రి ఈ కొత్త టెక్నిక్‌ను అమలు చేస్తోంది. బ్రిటన్‌లో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స అన్నది సర్వసాధారణం. అన్ని ఆపరేషన్లలో ఇది మూడవ స్థానం వహిస్తుంటుంది. 2017 లో లక్ష మందికి పైగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఈ కొత్త టెక్నిక్‌లో ఏ మోకాలి భాగానికి ఆపరేషన్ అవసరమవుతుందో ఆ భాగం పైన వెల్క్రోస్ట్రాప్ టూర్నికెట్ అనే దాన్ని అమర్చి మోకాలి కింది భాగానికి రక్త ప్రసరణ తక్కువ ఉండేలా చూస్తారు.

సర్జన్ నిట్టనిలువునా మోకాలిపై కోత కోసి మోకాలి చిప్పను పక్కకు తోస్తారు. తొడ ఎముకను, చర్మానికి అంటుకున్న ఎముకను బయటకు తీసుకు వస్తారు. ప్రకాశ వంతమైన కోబాల్టు క్రోమ్ లోహం చిప్పను అమర్చే ముందు రెండు ఎముకల చివరను చిప్స్‌తో సర్జన్ అతికిస్తారు. లోహం ముక్కల మధ్య ప్లాస్టిక్ చిప్ప అమర్చి చర్మం ఎముకకు జత చేస్తారు. ఇది ఎముక మజ్జలా పని చేస్తుంది. ఎముకల కీళ్ల దగ్గర ఒత్తిడి లేకుండా చూస్తుంది. చివరకు గాయాన్ని కుడతారు. వాటర్‌ప్రూఫ్‌తో కట్టుకడతారు. ఆ తరువాత ఫిజియో ధెరపిస్టు మూడుసార్లు రోగిని పర్యవేక్షిస్తారు. రోగుల్లో 40 శాతం మందికి పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ మోకాలి మార్పిడి అవసరం ఉంటుంది.

Knee transplant operation within four hours

The post నాలుగు గంటల్లోనే మోకాలి మార్పిడి ఆపరేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: