జన్యులోపం వల్లనే తరతరాలుగా గుండెపోటు

లాస్‌ఏంజెల్స్ : దాదాపు మూడు మిలియన్ సంవత్సరాల క్రితం ఆనాటి మన పూర్వికుల్లో ఏకైక జన్యువు లోపించడమే తరతరాలుగా గుండెపోటుకు, గుండెజబ్బులకు దారి తీస్తోందని అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డిగోస్కూలు ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఆ జన్యు లోపం కారణం గానే జంతుమాసం తిన్న వారికి ఈనాడు అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నాయని కూడా చెప్పారు. గుండెకు సంబంధించిన ధమనుల్లో కొవ్వు పదార్ధాలు పేరుకుని పోవడంతో వచ్చే జబ్బును […] The post జన్యులోపం వల్లనే తరతరాలుగా గుండెపోటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లాస్‌ఏంజెల్స్ : దాదాపు మూడు మిలియన్ సంవత్సరాల క్రితం ఆనాటి మన పూర్వికుల్లో ఏకైక జన్యువు లోపించడమే తరతరాలుగా గుండెపోటుకు, గుండెజబ్బులకు దారి తీస్తోందని అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డిగోస్కూలు ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఆ జన్యు లోపం కారణం గానే జంతుమాసం తిన్న వారికి ఈనాడు అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నాయని కూడా చెప్పారు. గుండెకు సంబంధించిన ధమనుల్లో కొవ్వు పదార్ధాలు పేరుకుని పోవడంతో వచ్చే జబ్బును అథెరోస్క్లిరోసిస్ అని అంటారు. ప్రపంచం మొత్తం మీద వచ్చే గుండెజబ్బుల రోగుల్లో మూడోవంతు మరణాలకు ఇదే కారణంగా పరిశోధనల్లో వెల్లడైంది.

ఇది కాక, బ్లడ్ కొలెస్టరల్, మాంద్యం, చురుకుదనం లోపించడం, వయోభారం, రక్తపోటు, ఊబకాయం, పొగతాగడం ఇవన్నీ కూడా గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. ఏదెలాగ ఉన్నా గుండెజబ్బులకు సంబంధించి (కార్డియో వాస్కులర్ డిసీజ్) సంఘటనలు అథెరోస్లిరోసిస్ వల్లనే 15 శాతం వరకు ఉంటున్నాయని పరిశోధకులు వివరించారు. మానవుల్లో ఇది సహజంగా కనిపించినా చింపాజీ వంటి మానవ లక్షణాలు కలిగిన క్షీరదాల్లో ఇటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవని దశాబ్ద క్రితం నమ్మేవారు. అయితే చింపాజీల్లో గుండె కండరాలు దెబ్బతినడం వల్ల అథెరోస్లిరోసిస్ వస్తోందని అధ్యయనంలో తేలింది. అయితే ఇప్పుడు చేపట్టిన పరిశోధనల్లో జన్యులోపం వల్లనే ఇది సంక్రమిస్తుందని నిరూపించడానికి ఎలుకలో జన్యు లోపం ఉండేలా ప్రయోగం చేశారు.

అంటే నెయు 5జిసి అనే సియాలిక్ యాసిడ్ సుగర్ మోలిక్యూల్ లోపం తో ఉన్న ఎలుకగా మార్పు చేశారు. దాంతో అధెరోజెనెసిస్ పెరిగేలా చూశారు. ఫలితంగా సిఎంఎహెచ్ అనే జన్యువును ఎలుక తిరిగి పొంద గలిగి నెయు5 జిసిని ఉత్పత్తి చేయ గలిగింది. సిఎంఎహ్‌చ్ జన్యువును నిర్వీర్యం చేసేలా వచ్చే మార్పు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం హొమినిన్ పూర్వికుల్లో జరగడం వల్లనే మలేరియా పరాన్న జీవితో సంబంధం ఏర్పడిందని, ఆ పరాన్న జీవి నెయు 5 జిసిని తిరిగి పునరుద్ధరించుకో గలిగిందని పరిశోధకులు వివరించారు. మనుషుల్లో మాదిరిగా సిఎంఎహెచ్, నెయు5 జిసి ఎలుకలో నిర్మూలించడం వల్లనే అథెరోస్లిరోసిస్ తీవ్రత పెరిగిందని పరిశోధకులు నిరూపించారు. ఈ పరిశోధనలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు.

Genetic deficiency is a heart attack for generations

The post జన్యులోపం వల్లనే తరతరాలుగా గుండెపోటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: