శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్

కోల్‌కతా: బిజెపిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌కు కోల్‌కతాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఆరెస్టు వారెంట్ జారీ చేసింది. గతేడాది జులైలో కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఒక రాజకీయ సభ లో థరూర్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బిజెపి తిరిగి అధికారం చేపడితే భారత్‌ను ‘హిందూ పాకిస్థాన్’గా మారుస్తుందంటూ తీవ్రవాఖ్యలు చేశారు. బిజెపి ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చి తమకు అనుకూలంగా సవరణలు కూడా […] The post శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


కోల్‌కతా: బిజెపిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌కు కోల్‌కతాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఆరెస్టు వారెంట్ జారీ చేసింది. గతేడాది జులైలో కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఒక రాజకీయ సభ లో థరూర్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బిజెపి తిరిగి అధికారం చేపడితే భారత్‌ను ‘హిందూ పాకిస్థాన్’గా మారుస్తుందంటూ తీవ్రవాఖ్యలు చేశారు. బిజెపి ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చి తమకు అనుకూలంగా సవరణలు కూడా చేస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో మాదిరిగా మైనార్టీ వర్గాలకు ఏ మాత్రం విలువనివ్వరని, పూర్తిగా అణిచివేస్తారంటూ విమర్శలు చేశారు. దీనిపై ఓ బిజెపి కార్యకర్త కోర్టుకెక్కారు. మంగళవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Kolkatha Court Isue Arrest Warrant Against MP Shashi Tharoor

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: