నీటి కొరత సాకుతో బాలికల జుట్టు కటింగ్

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: నీళ్లు లేవన్నసాకుతో విద్యార్థినుల త లనీలాలను సగానికి కట్ చేయించిన ఒక పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం మెదక్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నీటి కొరత ఉందన్న నెప ంతో మెదక్‌లోని మినీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినుల జుత్తును ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కత్తిరించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాలికలతోపాటు త ల్లితండ్రుల కథనం ప్రకారం.. మెదక్ పట్టణంలోని మినీ గురుకుల పాఠశాలలో ఒకటి నుంచి 6వ తరగతి వర కు […] The post నీటి కొరత సాకుతో బాలికల జుట్టు కటింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: నీళ్లు లేవన్నసాకుతో విద్యార్థినుల త లనీలాలను సగానికి కట్ చేయించిన ఒక పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం మెదక్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నీటి కొరత ఉందన్న నెప ంతో మెదక్‌లోని మినీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినుల జుత్తును ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కత్తిరించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాలికలతోపాటు త ల్లితండ్రుల కథనం ప్రకారం.. మెదక్ పట్టణంలోని మినీ గురుకుల పాఠశాలలో ఒకటి నుంచి 6వ తరగతి వర కు సుమారు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు.

కాగా పాఠశాల ప్రిన్సిపాల్ అరుణారెడ్డి హాస్టల్‌లో నీళ్లకు కొరత ఏర్పడిందన్న కారణంతో 128 మం ది విద్యార్థినులు వద్దని మొత్తుకుంటున్నా వినకుం డా బలవంతంగా వారి జుత్తును సగంకత్తిరించా రు. విషయం తెలుసుకున్న వారి తల్లితండ్రులు ఆగ్రహంతో పాఠశాలకు తరలిరాగా ప్రధాన గేటు వద్ద వారిని గిరిజన గురుకుల పాఠశాల సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లితండ్రులు పాఠశాల సిబ్బంది, ఆయాపై చేయి వేసుకున్నారు. అనుమతిలేకుండా ఆడపిల్లలకు జుత్తు ఎలా కట్ చేస్తారని ప్రిన్సిపాల్‌పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.

కాగా, వెంట్రుకలు కట్ చేసిన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడాలని ప్రిన్సిపాల్ అరుణారెడ్డి ముందుగానే సిబ్బందిని హెచ్చరించగా ఉపాధ్యాయులు కూడా ప్రిన్సిపాల్ మాటను జవదాటకుండా జాగ్రత్త పడ్డారు. అయితే బాధిత విద్యార్థినులు తమ తల్లితండ్రులకు ఈ విషయం తెలియచేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత విద్యార్థినుల తల్లితండ్రులు మీడియాతో మాట్లాడుతూ రానున్న రెండు నెలల్లో పండగ ఉందని, తమ పిల్లల తలానీలాలను సమర్పిస్తామని దేవుడికి మొక్కుకున్నామని వారు వాపోయారు. నీటి ఇబ్బంది వల్ల తమ పిల్లల వెంట్రుకలను కత్తిరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలని లేనిపక్షంలో స్వాతంత్య్ర వేడుకలను బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. కాగా తల్లితండ్రులకు, సిబ్బందికి మధ్య జరిగిన తోపులాటలో ఒక విద్యార్థినికి గాయమైంది. ఆ బాలికను ఎలాంటి చికిత్సను పాఠశాల సిబ్బంది అందచేయక పోవడంతోపాటు కనీసం ఆమె తల్లితండ్రులకు సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
ఆరోగ్య పరంగానే జుత్తు కత్తిరింపు: అరుణారెడ్డి
మినీ గురుకులంతో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, అంతేకాకుండా విద్యార్థినుల తలలో పేలు ఎక్కువైనందున ఆరోగ్య రీత్యా జుట్లు కత్తిరించామని ప్రిన్సిపాల్ అరుణారెడ్డి తెలిపారు. ఈవిషయం విద్యార్థినుల తల్లితండ్రులకు కొంతమందికి మాత్రమే సమాచారం ఇచ్చామన్నారు. దీనిపై ముందస్తుగా ఆర్సీవో సత్యనారాయణ అనుమతితోనే విద్యార్థినుల ఆరోగ్య రీత్యా వెంట్రుకలు కత్తిరించామని ఆమె వివరణ ఇచ్చారు.

protests over the school principal cutting student hair

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నీటి కొరత సాకుతో బాలికల జుట్టు కటింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: