ఆరోగ్య తెలంగాణ…

ప్రభుత్వం, ప్రైవేటు కలిస్తేనే అభివృద్ధి, ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలి సిరిసిల్లలో ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ కెటిఆర్ మన తెలంగాణ /సిరిసిల్ల : ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆరో గ్య తెలంగాణ సాధించేంత వరకు నిబద్ధ్దతతో పనులు కొనసాగిస్తామని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అం తర్జాతీయ […] The post ఆరోగ్య తెలంగాణ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రభుత్వం, ప్రైవేటు కలిస్తేనే అభివృద్ధి, ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలి

సిరిసిల్లలో ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ కెటిఆర్

మన తెలంగాణ /సిరిసిల్ల : ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆరో గ్య తెలంగాణ సాధించేంత వరకు నిబద్ధ్దతతో పనులు కొనసాగిస్తామని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అం తర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎల్‌వి ప్రసా ద్ కంటి ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కోసం స్వ చ్ఛంద సంస్థలు సేవా భావంతో ముందుకు రా వాలని, ప్రభుత్వం ప్రైవేట్ రంగం కలిసి సాగితేనే అభివృధ్ధి సాధ్యమని అన్నారు. ప్రపంచం లో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా కంటివెలుగు పథకం ప్రారంభించి ఇంటింటిలో కంటి పరీక్షలు చేయించిన ఘనత సిఎం కెసిఆర్ దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజలందరికి హెల్త్ ప్రొ ఫైల్ రూపొందించి అత్యవసర సమయంలో ప్రజల ఆరోగ్య వివరాలు సరిచూసుకుని వారి కి చికిత్స చేసే గొప్ప పథకం సిఎం కెసిఆర్ ప్రా రంభిస్తున్నారన్నారు. సర్వేంద్రియానాం నయ నం ప్రధానం కాబట్టి కళ్లకు తగిన వైద్యం అం దాలన్నారు.

సిరిసిల్లలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఎల్‌వి పసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభించడం అభినందనీయమన్నారు. తెలంగాణలో సిరిసిల్లలో ప్రారంభించే ఆసుపత్రితో 7వ దన్నారు. ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రులు కనీసంగా 150 కిలో మీటర్ల మధ్య దూరం ఉ ండేలా చూసుకుని ఏర్పాటు చేస్తారని అయితే సిరిసిల్ల ప్రత్యేక పరిస్థితుల దృష్టా సుమారు 30 కిలో మీటర్ల దూరంలోనే ఆసుపత్రిని ప్రారంభించేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా సిరిసిల్ల పట్టణం నడిబొడ్డున 15 వేల చదరపు అడుగుల వైశాల్యంలో కంటి ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రి కోసం కేవలం స్థలం మాత్రమే సమకూర్చిందని, హెటిరో సంస్థవారే రూ.లు 5 కోట్లు వెచ్చించి జి + టూ భవనాన్ని నిర్మిస్తున్నారన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో 50 శాతం కంటి సమస్యలు దూరం చేయాలనే లక్షంతో సంస్థ పనిచేస్తోందన్నారు. హెటిరో సంస్థ స్ఫూర్తితో ఇతరులు కూడా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఏడాది కాలంలో భవన నిర్మాణం పూర్తయిన తరువాత నాగేశ్వరరావు, పార్థసారధిల సమక్షంలోనే ప్రారంభం చేసు కుందామన్నారు.
ఈ సందర్భంగా హెటిరో సంస్థవారు ఆసుపత్రి పనుల ప్రారంభం కోసం రూ 50లక్షల చెక్కును కెటిఆర్‌కు అందించారు. సమావేశంలో ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైస్ చైర్మన్ ఆత్మకూరి రామన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రులు 19 నిర్వహిస్తుండగా తెలంగాణలోనే ఆరు ఉన్నాయని, సిరిసిల్లలోది 7వ దన్నారు. డా. రోహిత్‌కుమార్, సుధాకర్ రెడ్డి, డా. రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే తమ లక్షమన్నారు. ఈ సమావేశంలో జడ్‌పి చైర్మన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షులు గడ్డం నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

KTR Lay Foundation Stone For L V Prasad Eye Hospital

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆరోగ్య తెలంగాణ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: